Saturday, March 24, 2018

దేవుణ్ణి చూడాలంటే

ఒకతను దేవుడు లేడు, ఉంటే చూపించండి అంటూ ఉపన్యాసం చెపుతున్నాడు. చాలా సేపటి నుంచి దాన్ని వింటున్న ఒక పల్లెటూరి వ్యక్తి ఆ ఉపన్యాసం చెప్తున్న వ్యక్తితో, అయ్యా నేను దేవున్ని చూపిస్తా కాని నాదొక చిన్న కోరిక ఉంది మీరైతేనే అది తీరుస్తారు అంటే చాలా దూరం నుంచి వచ్చాను అన్నాడు.
దానికి ఆ వ్యక్తి తప్పకుండా, చెప్పండి మీకు ఏం కావాలో అని.
ప.వ్య.- అయ్యా మా ఊర్లో కరెంట్ లేదు, నాకు చిన్నప్పటి నుంచి కరంటు ను చూడాలని కోరిక, మీరైతే చూపించగలరు అని చేప్తే ఇక్కడికి వచ్చా.. 
దానికి ఉపన్యాసం చెప్తున్న వ్యక్తి, ఇదిగో ఈ ఫ్యాన్ కరంట్ తోనే నడుస్తున్నది, ఆ లైట్ కరంట్ తోనే వెలుగుతున్నది అన్నాడు.
ప. వ్యక్తి. - అయ్యా నేను కరంటును చూపించమంటే కరంటు తో పని చేస్తున్న వస్తువులను చూపిస్తున్నారు.
ఉ.చె. వ్య. మరీ మూర్ఖుడిలా ఉన్నావే, కరంట్ అనేది శక్తి, డైరెక్ట్ గా కనపడదు, ఇలా వస్తువుల ద్వారా ఉంది అని తెలుసుకోవాలి.
ప.వ్య. మరి దేవుడు కూడా శక్తి స్వరూపం కదా, ఈ భూమి మీద ప్రతి జీవి ఆ శక్తితోనే నడుస్తోంది కదా, అది గుర్తించక దేవున్ని చూపించమని ఛాలెంజ్ చేస్తున్న మీరు కూడా మూర్ఖులే అవుతారు కదా ... దైవం, నీలో, నాలో అందరిలో ఉన్నాడు, దేవున్ని తెలుసుకోవాలి తప్ప, చూడాలనుకోకూడదు. ఈ విషయం అర్థమైతే మళ్లీ దీని గురించి ఇలాంటి వాదనలు చేయరు .. అన్నాడు.
విషయం అర్థమైన ఉపన్యాసకుడు అక్కడినుంచి వెళ్లిపోయాడు.

No comments:

Post a Comment

Thanks for your comment.