Saturday, March 17, 2018

స్వస్తిశ్రీ విలంబి(విలంబ, విళంబి)నామ సంవత్సర పంచాంగము - రాశి ఫలములు

Details of Kingdom for the year Vilambi

స్వస్తిశ్రీ విలంబి(విలంబ)నామ సంవత్సర పంచాంగము - ఫలితములు

పంచాంగ పీఠిక

Telugu Panchang details

Telugu Rashi phalaalu (Rashiphalalu)

కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియుగ ప్రథమ పాదములో 5119వది, ప్రభవాది 60 సంత్సరాలలో 32వది యైన ఈ సంవత్సరము చాంద్రమానమున స్వస్తిశ్రీ విలంబి(విలంబ) (విలంబ) నామ సంవత్సరంగా చెప్పబడుతున్నది.
  • కలియుగ శతాబ్దములు – 5119
  • శ్రీ ఆది శంకరాచార్యాబ్దములు – 2089
  • శాలివాహన శతాబ్దములు – 1940
  • ఫసలీ శతాబ్దములు – 1426– 27
  • హిజరీ శతాబ్దములు – 1438 – 39
  • శ్రీ రామానుజాబ్దములు – 1001
  • క్రీస్తు శకము – 2018-19

విలంబి(విలంబ) నామ సంవత్సర ఫలము

ఈ విలంబి(విలంబ) నామ సంవత్సరంలో రాజులకు యుద్దములు, అతివృష్టి, రోగ బాధలు ఎక్కువగా ఉంటాయి. లోకములు అధర్మముతో నిండి, ధన మూల యుద్ధములతో, స్వల్ప వృష్టి, స్వల్ప సస్యములతో కూడి యుండును.

రాజాధి నవనాయక నిర్ణయం

రాజుచైత్ర శుద్ధపాడ్యమి వారాధిపతిసూర్యుడు
మంత్రిమేష సంక్రమణ దినాధిపతిశని
సేనాధిపతిసింహ సంక్రమణ దినాధిపతిశుక్రుడు
సస్యాధిపతికర్క సంక్రమణ దినాధిపతిచంద్రుడు
ధాన్యాధిపతిధనూ సంక్రమణ దినాధిపతిసూర్యుడు
అర్ఘాధిపతిమిథున సంక్రమణ దినాధిపతిశుక్రుడు
మేఘాధిపతిఆర్ద్రాప్రవేశ దినాధిపతిశుక్రుడు
రసాధిపతితులా సంక్రమణ దినాధిపతిబుధుడు
నీరసాధిపతిమకర సంక్రమణ దినాధిపతిచంద్రుడు

ఉపనాయకులు

పురోహితుడువృషభ సంక్రమణ దినాధిపతిచంద్రుడు
పరీక్షకుడుకన్యా సంక్రమణ దినాధిపతిచంద్రుడు
గణకుడుకుంభ సంక్రమణ దినాధిపతిబుధుడు
గ్రామపాలకుడువృశ్చిక సంక్రమణ దినాధిపతిచంద్రుడు
దైవజ్ఞుడుమీన సంక్రమణ దినాధిపతిచంద్రుడు
రాష్ట్రాధిపతిఉగాది వారాధిపతిసూర్యుడు
సర్వదేశోద్యోగపతిమేష సంక్రమణ దినాధిపతిసూర్యుడు
గజాధిపతివృషభ సంక్రమణ దినాధిపతిశని
పశునాం అధిపతిమిథున సంక్రమణ దినాధిపతిచంద్రుడు
దేవాధిపతికర్క సంక్రమణ దినాధిపతిచంద్రుడు
నరాధిపతిసింహ సంక్రమణ దినాధిపతిచంద్రుడు
గ్రామనాయకుడుకన్యా సంక్రమణ దినాధిపతిచంద్రుడు
వస్త్రాధిపతితులా సంక్రమణ దినాధిపతిబుధుడు
రత్నాధిపతివృశ్చిక సంక్రమణ దినాధిపతిసూర్యుడు
వృక్షాధిపతిధనూ సంక్రమణ దినాధిపతిశుక్రుడు
జంగమాధిపతిమకర సంక్రమణ దినాధిపతిబుధుడు
సర్పాధిపతికుంభ సంక్రమణ దినాధిపతిబుధుడు
మృగాధిపతిమీన సంక్రమణ దినాధిపతిశుక్రుడు
శుభాధిపతిసంవత్సరాది తిథి అధిపతిసూర్యుడు
స్త్రీణాం అధిపతిఆర్ద్రాప్రవేశ దినాధిపతిశుక్రుడు

విలంబి(విలంబ) నామ సంవత్సర రాజాధి నవ నాయక ఫలం

ఒక రాజ్యానికి, ఒక ప్రభుత్వానికి ఎలా అయితే మంత్రి మండలి ఉంటుందో, ప్రతి సంవత్సరానికి అలా రాజాధి నవ నాయకులు, ఉప నాయకులు ఉంటారు. ఈ విలంబి(విలంబ) నామ సంవత్సరానికి రాజు మరియు ధాన్యాధిపతి సూర్యుడు, మంత్రి శని, సేనాధిపతి, అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి శుక్రుడు , సస్యాధిపతి మరియు నీరసాధిపతి చంద్రుడు.
ఈ విలంబి(విలంబ) నామ సంవత్సరానికి రాజు సూర్యుడు. సంవత్సరాది ఆదివారం రోజున వచ్చింది కాబట్టి ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు అవుతాడు.. గ్రహ కారకత్వ రీత్యా సూర్యుడు సహజ రాజ్యాధిపతి అవటం వలన పరిపాల బాగుంటుంది. అయితే సూర్యునికి శతృవైన శని మంత్రి అవటం వలన మంత్రులతో వైరము ఉంటుంది. అలాగే ప్రజలకు అధికారుల వలన సమస్యలు ఎక్కువ అవుతాయి. వర్షపాతం మధ్యమంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ సంవస్తరములో ప్రజలు దొంగల కారణంగా, అగ్ని ప్రమాదాల కారణంగా బాధ పడతారు.
ఈ సంవత్సరం మంత్రి శని అవటం వలన ప్రజలు పనులలో అలసత్వాన్ని వహిస్తారు. బద్ధకం పెరుగుతుంది. ఈర్ష్యాద్వేషాలు పెరగటమే కాకుండా ప్రజలు మత్తు పదార్థములకు, పానీయములకు బానిసలు అవుతారు. అనారోగ్యాల పాలవుతారు. అకాల వర్షాల కారణంగా వ్యాపారంలో, వ్యవసాయంలో ప్రజలు నష్టపోతారు.
ఈ సంవత్సరం చంద్రుడు సస్యాధిపతి అవటం వలన సమస్త జీవరాశులు సుఖశాంతులతో ఉంటాయి. మాగాణి, మెట్టభూములలో దిగుబడి అధికంగా ఉంటుంది. అకాల వర్షాలు ఉన్నప్పటికీ, వ్యవసాయానికి తగిన నీరు అందుబాటులో ఉండటం, నదుల్లో పుష్కలమైన జలం ఉండటం కారణంగా పంటలు అధికంగా పండుతాయి. ఖగోళ విశేషాలు చోటుచేసుకుంటాయి.
సూర్యుడు ధాన్యాధిపతి అవటం వలన ఈ సంవత్సరం బంగారం ధర అలాగే భూముల ధరలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వములో సాంకేతిక అభివృద్ధి చోటుచేసుకుంటుంది. అద్యోగార్థిలకు సరియైన ఉద్యోగాలు లభిస్తాయి. నిరుద్యోగ సమస్య కొంత తొలగి పోతుంది. ఎరుపు వర్ణపు ధాన్యాలు ఎక్కువ దిగుబడి ఇస్తాయి. ప్రమాదముల కారణంగా ప్రజలలో భయాందోళనలు పెరుగుతాయి.
శుక్రుడు ఈ సంవత్సరం మేఘాధిపతి అయినందున వర్షపాతం మధ్యమంగా ఉంటుంది. ధాన్యం ధర పెరుగుతుంది. ప్రజలలో ఆర్థికలావాదేవీల పైన ఆసక్తి పెరుగుతుంది. పాలకులనుంచి పాలు, పండ్లు, ధాన్యములు మరియు వస్త్రోత్పత్తికి  ప్రజలకు సహాయం అందుతుంది.
ఈ సంవత్సరం రసాధిపతి బుధుడు అయినందున వివాహ విషయంలో ప్రజలలో స్వేచ్ఛ పెరుగుతుంది. కుల, మతాల పట్టింపులు వివాహవిషయంలో పట్టించుకోవటం తగ్గుతుంది. నిమ్నవర్గాలు అభివృద్ధి చెందుతాయి. సుగంధ ద్రవ్యాలకు, ఫలపుష్పాదులకు మంచి ధరలు వస్తాయి. దేశము సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది.
ఈ సంవత్సరం నీరసాధిపతి చంద్రుడు అయినందున లోహాలు, కలప, కాగితం, వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతాయి. ధాన్యముల ధరలు పెరుగుతాయి.. వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఆకస్మిక వరదల కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతుంది. ప్రజలు అస్థిరత్వానికి లోనవుతారు,
ఈ సంవత్సరం సేనాధిపతి శుక్రుడు అవటం వలన స్త్రీలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ధరలు పెరుగుతాయి. ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. ప్రభుత్వం కళలకు ప్రాధాన్యత ఇస్తుంది. స్త్రీలకు అధికార ప్రాప్తి, సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటం మొదలైన ఫలితాలుంటాయి.
ఈ సంవత్సరం అర్ఘాధిపతి శుక్రుడు అవటం వలన భూములు, బంగారం మరియు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ప్రజలు అలంకార వస్తువులకు, విలాసాలకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రజాసంక్షేమం కొరకు ప్రభుత్వాలు చేసే కృషి ఫలిస్తుంది.

No comments:

Post a Comment

Thanks for your comment.