Saturday, March 31, 2018

Rashiphal (Rashifal) for April 2018

Rashiphal (Rashifal) for April 2018

Monthly Rashiphal for the Year 2018

Rashiphal (Rashifal) for April 2018

Career, Education, Family, Health, Business and Finance


Welcome to monthly Rashiphal (Rashifal) section, These predictions are based on Moon sign. Monthly transits of Sun, Mars, Venus and Mercury are considered in these predictions. Click on your Moon sign image to see this month Rashi phal. Rashiphal or rashifal is also called as gochar, means transits of planets. Every planetary transit from Moon gives a different result. Planets over the fourth house, eighth house and the twelfth house will give bad results. All planets will give good result in third, sixth and eleventh house. Especially eleventh house called labha sthana, which fulfils our desires and gives overall success. In general planetary transit over fourth house gives heavy workload and stress. Transit from eighth house gives accidents, losses and over twelfth house gives health issues and financial losses. Every Rashi and lagna will have a different result for each planet in different houses. Sun, Mercury and Venus transit in a sign for a month. Mars transits over a sign for around 45 days. Jupiter transits in a sign for a year. Rahu and Ketu transit in a sign for 18 months. Saturn transits in a sign for two and half years.

Details of Planetary transits in April 2018.
In this April month, Sun transits over Meena Rashi up to 14th and then he moves to Mesha Rashi. Venus transits over Mesha Rashi up to 20th and then he moves to Vrishabha Rashi. Mars and Saturn continue their transit over Dhanu Rashi, Retrograde Jupiter continues his transit over Tula Rashi, Retrograde Mercury continues his transit over Meena Rashi, Rahu continues his transit over Karka Rashi and Ketu over Makara Rashi.

Click here for April 2018 Rashiphal

Saturday, March 24, 2018

అవతార ధర్మం

పాటించాల్సిన ధర్మాన్ని పాటించకుండా రకరకాల సాకులు చెప్పి తప్పించుకోవటం మనిషి లక్షణం. అలా తప్పించుకోకుండా మనిషిగా పుట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని పాటించవచ్చు అని రాముడు, ఎన్ని సుఖాలున్నా ధర్మాన్ని పాటించవచ్చు అని కృష్ణుడు నిరూపించారు. వారి కంటే కష్టం కానీ, సుఖం కానీ ఏ మనిషీ అనుభవించలేడు.

రాహుకేతువులు

రాహుకేతువులు మనిషియొక్క అహంకారానికి, ఆత్మన్యూనతకు కారకులు. జాతకంలో రాహువు అనుకూలంగా లేనప్పుడు, రాహువు దశ, అంతర్దశ, ప్రత్యంతర్దశలు నడిచినప్పుడు మనలో ఒకింత అహంకారం పెరుగుతుంది. దాని కారణంగా తెలిసి కూడా తప్పులు చేయటం, వివాదాలు పెట్టుకోవటం, లేనిది ఉన్నట్టు ఊహించుకుని స్నేహితులతో, బంధువులతో సంబంధాలు చెడగొట్టుకోవటం మొదలైన ఫలితాలు ఏర్పడతాయి. అదే కేతువు దశా, అంతర్దశ లేదా ప్రత్యంతర్దశలో మనలో ఆత్మస్థైర్యం (కాన్ఫిడెన్స్) సన్నగిల్లటం, భయం పెరగటం, అపజయం పాలవుతానని అసలు ఏ పని చేయకుండా ఉండటం, చిరాకు ఎక్కువ అవటం, ప్రతివారు తమ గురించి చెడుగా అనుకుంటున్నారని ఊహించుకోవటం మొదలైన ఫలితాలుంటాయి. మీకు పైన చెప్పిన ఫలితాల్లో ఏవి కనిపించినా మీకు రాహు కేతువులకు సంబంధించిన దశా, భుక్తి, ప్రత్యంతరాల్లో ఏదో ఒకటి నడుస్తున్నట్టు గుర్తు. ఈ రాహు సంబంధ సమస్యలనుంచి బయటకు రావటానికి దుర్గా ఆరాధన చేయటం మంచిది. అలాగే కేతు సంబంధ సమస్యలు దూరం అవటానికి గణేశ ఆరాధన చేయటం మంచిది. ఆరాధన అంటే జప, మంత్ర, స్తోత్ర, పూజాదికాల్లో ఏదైనా ఒక పద్ధతిలో దైవాన్ని కొలవటం.

పురాణాలు

చాలా మందికి పురాణాలు కేవలం దేవునికి సంబంధించిన కథల్లా కనిపిస్తాయి కాని పురాణాల్లో చెప్పే ప్రతి కథలో చాలా శాస్త్రాలు అంతర్గతంగా చెప్పబడ్డాయి. మనిషి ఎదుగుదలకు ఉపయోగపడే అనేక అంశాలు జనాలకు ఆసక్తి కలిగించే కథల రూపంలో ఇస్తూ అంతర్గతంగా అనేక అంశాలు చెప్పారు మన ఋషులు. పురాణాల్ని కేవలం మత సంబంధ కథల్లా చూడకండి. అవి మానవాళికి ఉపయోగపడే విజ్ఞాన భాండాగారాలు.

జ్యోతిషం - పరిహారాలు

చాలా మందికి జ్యోతిష్యంలో చెప్పే పరిహారాల గురించి సందేహాలున్నాయి. జపాలు పూజలు చేస్తే పని అవుతుందా, జపాలు, పూజలు చేసాం కదా మళ్లీ పని విషయంలో కష్టపడటం ఎందుకు అని. దానికి సమాధానం.. మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు రోడుకు అడ్డంగా రాళ్లు ఉంటే, వాటిని తొలగించి ముందుకు వెళతాం, అలాగే మన జాతకరీత్యా ఏవైనా దోషాలుంటే పరిహారాలతో వాటిని తొలగించుకుని ముందుకు వెళతాం. రోడ్డు మీద రాళ్లు తొలగించినంత మాత్రాన నడవకుండా మనం గమ్యం ఎలాగైతే చేరలేమో, కేవలం పరిహారాలు చేసి పనిచేయకున్న అనుకున్న ఫలితాన్ని పొందము. జ్యోతిషం సరైన మార్గాన్ని సూచిస్తుంది, మన శ్రమ మాత్రమే మనను గమ్యానికి చేరుస్తుంది. అది ఉద్యోగం అయినా, విద్య అయినా లేక సంతానం అయినా పరిహారాలతో పాటు మానవ ప్రయత్నమూ ఉండాలి.

దేవుణ్ణి చూడాలంటే

ఒకతను దేవుడు లేడు, ఉంటే చూపించండి అంటూ ఉపన్యాసం చెపుతున్నాడు. చాలా సేపటి నుంచి దాన్ని వింటున్న ఒక పల్లెటూరి వ్యక్తి ఆ ఉపన్యాసం చెప్తున్న వ్యక్తితో, అయ్యా నేను దేవున్ని చూపిస్తా కాని నాదొక చిన్న కోరిక ఉంది మీరైతేనే అది తీరుస్తారు అంటే చాలా దూరం నుంచి వచ్చాను అన్నాడు.
దానికి ఆ వ్యక్తి తప్పకుండా, చెప్పండి మీకు ఏం కావాలో అని.
ప.వ్య.- అయ్యా మా ఊర్లో కరెంట్ లేదు, నాకు చిన్నప్పటి నుంచి కరంటు ను చూడాలని కోరిక, మీరైతే చూపించగలరు అని చేప్తే ఇక్కడికి వచ్చా.. 
దానికి ఉపన్యాసం చెప్తున్న వ్యక్తి, ఇదిగో ఈ ఫ్యాన్ కరంట్ తోనే నడుస్తున్నది, ఆ లైట్ కరంట్ తోనే వెలుగుతున్నది అన్నాడు.
ప. వ్యక్తి. - అయ్యా నేను కరంటును చూపించమంటే కరంటు తో పని చేస్తున్న వస్తువులను చూపిస్తున్నారు.
ఉ.చె. వ్య. మరీ మూర్ఖుడిలా ఉన్నావే, కరంట్ అనేది శక్తి, డైరెక్ట్ గా కనపడదు, ఇలా వస్తువుల ద్వారా ఉంది అని తెలుసుకోవాలి.
ప.వ్య. మరి దేవుడు కూడా శక్తి స్వరూపం కదా, ఈ భూమి మీద ప్రతి జీవి ఆ శక్తితోనే నడుస్తోంది కదా, అది గుర్తించక దేవున్ని చూపించమని ఛాలెంజ్ చేస్తున్న మీరు కూడా మూర్ఖులే అవుతారు కదా ... దైవం, నీలో, నాలో అందరిలో ఉన్నాడు, దేవున్ని తెలుసుకోవాలి తప్ప, చూడాలనుకోకూడదు. ఈ విషయం అర్థమైతే మళ్లీ దీని గురించి ఇలాంటి వాదనలు చేయరు .. అన్నాడు.
విషయం అర్థమైన ఉపన్యాసకుడు అక్కడినుంచి వెళ్లిపోయాడు.

Saturday, March 17, 2018

స్వస్తిశ్రీ విలంబి(విలంబ, విళంబి)నామ సంవత్సర పంచాంగము - రాశి ఫలములు

Details of Kingdom for the year Vilambi

స్వస్తిశ్రీ విలంబి(విలంబ)నామ సంవత్సర పంచాంగము - ఫలితములు

పంచాంగ పీఠిక

Telugu Panchang details

Telugu Rashi phalaalu (Rashiphalalu)

కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియుగ ప్రథమ పాదములో 5119వది, ప్రభవాది 60 సంత్సరాలలో 32వది యైన ఈ సంవత్సరము చాంద్రమానమున స్వస్తిశ్రీ విలంబి(విలంబ) (విలంబ) నామ సంవత్సరంగా చెప్పబడుతున్నది.
  • కలియుగ శతాబ్దములు – 5119
  • శ్రీ ఆది శంకరాచార్యాబ్దములు – 2089
  • శాలివాహన శతాబ్దములు – 1940
  • ఫసలీ శతాబ్దములు – 1426– 27
  • హిజరీ శతాబ్దములు – 1438 – 39
  • శ్రీ రామానుజాబ్దములు – 1001
  • క్రీస్తు శకము – 2018-19

విలంబి(విలంబ) నామ సంవత్సర ఫలము

ఈ విలంబి(విలంబ) నామ సంవత్సరంలో రాజులకు యుద్దములు, అతివృష్టి, రోగ బాధలు ఎక్కువగా ఉంటాయి. లోకములు అధర్మముతో నిండి, ధన మూల యుద్ధములతో, స్వల్ప వృష్టి, స్వల్ప సస్యములతో కూడి యుండును.

రాజాధి నవనాయక నిర్ణయం

రాజుచైత్ర శుద్ధపాడ్యమి వారాధిపతిసూర్యుడు
మంత్రిమేష సంక్రమణ దినాధిపతిశని
సేనాధిపతిసింహ సంక్రమణ దినాధిపతిశుక్రుడు
సస్యాధిపతికర్క సంక్రమణ దినాధిపతిచంద్రుడు
ధాన్యాధిపతిధనూ సంక్రమణ దినాధిపతిసూర్యుడు
అర్ఘాధిపతిమిథున సంక్రమణ దినాధిపతిశుక్రుడు
మేఘాధిపతిఆర్ద్రాప్రవేశ దినాధిపతిశుక్రుడు
రసాధిపతితులా సంక్రమణ దినాధిపతిబుధుడు
నీరసాధిపతిమకర సంక్రమణ దినాధిపతిచంద్రుడు

ఉపనాయకులు

పురోహితుడువృషభ సంక్రమణ దినాధిపతిచంద్రుడు
పరీక్షకుడుకన్యా సంక్రమణ దినాధిపతిచంద్రుడు
గణకుడుకుంభ సంక్రమణ దినాధిపతిబుధుడు
గ్రామపాలకుడువృశ్చిక సంక్రమణ దినాధిపతిచంద్రుడు
దైవజ్ఞుడుమీన సంక్రమణ దినాధిపతిచంద్రుడు
రాష్ట్రాధిపతిఉగాది వారాధిపతిసూర్యుడు
సర్వదేశోద్యోగపతిమేష సంక్రమణ దినాధిపతిసూర్యుడు
గజాధిపతివృషభ సంక్రమణ దినాధిపతిశని
పశునాం అధిపతిమిథున సంక్రమణ దినాధిపతిచంద్రుడు
దేవాధిపతికర్క సంక్రమణ దినాధిపతిచంద్రుడు
నరాధిపతిసింహ సంక్రమణ దినాధిపతిచంద్రుడు
గ్రామనాయకుడుకన్యా సంక్రమణ దినాధిపతిచంద్రుడు
వస్త్రాధిపతితులా సంక్రమణ దినాధిపతిబుధుడు
రత్నాధిపతివృశ్చిక సంక్రమణ దినాధిపతిసూర్యుడు
వృక్షాధిపతిధనూ సంక్రమణ దినాధిపతిశుక్రుడు
జంగమాధిపతిమకర సంక్రమణ దినాధిపతిబుధుడు
సర్పాధిపతికుంభ సంక్రమణ దినాధిపతిబుధుడు
మృగాధిపతిమీన సంక్రమణ దినాధిపతిశుక్రుడు
శుభాధిపతిసంవత్సరాది తిథి అధిపతిసూర్యుడు
స్త్రీణాం అధిపతిఆర్ద్రాప్రవేశ దినాధిపతిశుక్రుడు

విలంబి(విలంబ) నామ సంవత్సర రాజాధి నవ నాయక ఫలం

ఒక రాజ్యానికి, ఒక ప్రభుత్వానికి ఎలా అయితే మంత్రి మండలి ఉంటుందో, ప్రతి సంవత్సరానికి అలా రాజాధి నవ నాయకులు, ఉప నాయకులు ఉంటారు. ఈ విలంబి(విలంబ) నామ సంవత్సరానికి రాజు మరియు ధాన్యాధిపతి సూర్యుడు, మంత్రి శని, సేనాధిపతి, అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి శుక్రుడు , సస్యాధిపతి మరియు నీరసాధిపతి చంద్రుడు.
ఈ విలంబి(విలంబ) నామ సంవత్సరానికి రాజు సూర్యుడు. సంవత్సరాది ఆదివారం రోజున వచ్చింది కాబట్టి ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు అవుతాడు.. గ్రహ కారకత్వ రీత్యా సూర్యుడు సహజ రాజ్యాధిపతి అవటం వలన పరిపాల బాగుంటుంది. అయితే సూర్యునికి శతృవైన శని మంత్రి అవటం వలన మంత్రులతో వైరము ఉంటుంది. అలాగే ప్రజలకు అధికారుల వలన సమస్యలు ఎక్కువ అవుతాయి. వర్షపాతం మధ్యమంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ సంవస్తరములో ప్రజలు దొంగల కారణంగా, అగ్ని ప్రమాదాల కారణంగా బాధ పడతారు.
ఈ సంవత్సరం మంత్రి శని అవటం వలన ప్రజలు పనులలో అలసత్వాన్ని వహిస్తారు. బద్ధకం పెరుగుతుంది. ఈర్ష్యాద్వేషాలు పెరగటమే కాకుండా ప్రజలు మత్తు పదార్థములకు, పానీయములకు బానిసలు అవుతారు. అనారోగ్యాల పాలవుతారు. అకాల వర్షాల కారణంగా వ్యాపారంలో, వ్యవసాయంలో ప్రజలు నష్టపోతారు.
ఈ సంవత్సరం చంద్రుడు సస్యాధిపతి అవటం వలన సమస్త జీవరాశులు సుఖశాంతులతో ఉంటాయి. మాగాణి, మెట్టభూములలో దిగుబడి అధికంగా ఉంటుంది. అకాల వర్షాలు ఉన్నప్పటికీ, వ్యవసాయానికి తగిన నీరు అందుబాటులో ఉండటం, నదుల్లో పుష్కలమైన జలం ఉండటం కారణంగా పంటలు అధికంగా పండుతాయి. ఖగోళ విశేషాలు చోటుచేసుకుంటాయి.
సూర్యుడు ధాన్యాధిపతి అవటం వలన ఈ సంవత్సరం బంగారం ధర అలాగే భూముల ధరలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వములో సాంకేతిక అభివృద్ధి చోటుచేసుకుంటుంది. అద్యోగార్థిలకు సరియైన ఉద్యోగాలు లభిస్తాయి. నిరుద్యోగ సమస్య కొంత తొలగి పోతుంది. ఎరుపు వర్ణపు ధాన్యాలు ఎక్కువ దిగుబడి ఇస్తాయి. ప్రమాదముల కారణంగా ప్రజలలో భయాందోళనలు పెరుగుతాయి.
శుక్రుడు ఈ సంవత్సరం మేఘాధిపతి అయినందున వర్షపాతం మధ్యమంగా ఉంటుంది. ధాన్యం ధర పెరుగుతుంది. ప్రజలలో ఆర్థికలావాదేవీల పైన ఆసక్తి పెరుగుతుంది. పాలకులనుంచి పాలు, పండ్లు, ధాన్యములు మరియు వస్త్రోత్పత్తికి  ప్రజలకు సహాయం అందుతుంది.
ఈ సంవత్సరం రసాధిపతి బుధుడు అయినందున వివాహ విషయంలో ప్రజలలో స్వేచ్ఛ పెరుగుతుంది. కుల, మతాల పట్టింపులు వివాహవిషయంలో పట్టించుకోవటం తగ్గుతుంది. నిమ్నవర్గాలు అభివృద్ధి చెందుతాయి. సుగంధ ద్రవ్యాలకు, ఫలపుష్పాదులకు మంచి ధరలు వస్తాయి. దేశము సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది.
ఈ సంవత్సరం నీరసాధిపతి చంద్రుడు అయినందున లోహాలు, కలప, కాగితం, వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతాయి. ధాన్యముల ధరలు పెరుగుతాయి.. వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఆకస్మిక వరదల కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతుంది. ప్రజలు అస్థిరత్వానికి లోనవుతారు,
ఈ సంవత్సరం సేనాధిపతి శుక్రుడు అవటం వలన స్త్రీలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ధరలు పెరుగుతాయి. ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. ప్రభుత్వం కళలకు ప్రాధాన్యత ఇస్తుంది. స్త్రీలకు అధికార ప్రాప్తి, సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటం మొదలైన ఫలితాలుంటాయి.
ఈ సంవత్సరం అర్ఘాధిపతి శుక్రుడు అవటం వలన భూములు, బంగారం మరియు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ప్రజలు అలంకార వస్తువులకు, విలాసాలకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రజాసంక్షేమం కొరకు ప్రభుత్వాలు చేసే కృషి ఫలిస్తుంది.