Saturday, April 30, 2016

Monthly Rashiphal for May 2016

Rashiphal (Rashifal), Monthly forecast, April 2016

Rashiphal (Rashifal) for May 2016

Welcome to monthly Rashiphal (Rashifal) section, There predictions are based on Moon sign. Monthly transits of Sun, Mars, Venus and Mercury are considered in these predictions. Click on your Moon sign image to see this month rashi phal.
In this May month Sun transiting over Mesha rashi up to 14th and then he moves to Vrishabha rashi. Venus will transit over Mesha rashi up to 19th and then he moves to Vrishabha rashi. This month four planets are in retro motion. Mars and Saturn in Vrishchika rashi, Jupiter in Simha rashi and Mercury in Mesha rashi will be in retro motion. This will impact on all rashi born.

Click here -->  Monthly Rashiphal for May 2016

Thursday, April 7, 2016

స్వస్తిశ్రీ దుర్ముఖినామ సంవత్సర రాశి ఫలితములు

Details of Kingdom for the year Durmukhiస్వస్తిశ్రీ దుర్ముఖినామ సంవత్సర రాశి ఫలితములు

పంచాంగ పీఠిక
Telugu Panchang details
కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియుగ ప్రథమ పాదములో 5117వది, ప్రభవాది 60 సంత్సరాలలో 30వది యైన ఈ సంత్సరమును చాంద్రమానమున స్వస్తిశ్రీ దుర్ముఖినామ సంవత్సరంగా చెప్పబడుతున్నది.

కలియుగ శతాబ్దములు – 5117
శ్రీ ఆది శంకరాచార్యాబ్దములు – 2087
శాలివాహన శతాబ్దములు – 1938
ఫసలీ శతాబ్దములు – 1424– 25
హిజరీ శతాబ్దములు – 1436 – 37
శ్రీ రామానుజాబ్దములు – 999
క్రీస్తు శకము – 2016-17
దుర్ముఖినామ సంవత్సర ఫలం
The rains are ordinary in Durmukh. The people suffer due to evil persons, thieves etc. There is enmity and differences between rulers and army chiefs. Result of Lord Saturn: Rains are less, people suffer due to disease and worries. There is drought in North, good crops in East. The security departments of rulers develop discords. Goods are expensive in Chaitra, Baisakh and Jyeshtha. In Shravan, there are high speed winds, the grains are cheap while in Bhadrapad there are non-stop rains. Aashwyuja month has disease, the metals are cheap. There is drought in Kartika Month, Margsheersh, Paush and Maagh. There is disease in Phalgun and there is enmity amongst rulers.

ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో వర్షపాతం సాధరణంగా ఉంటుంది. ప్రజలు దొంగలు, దుర్మార్గుల కారణంగా బాధింప బడతారు. రాజులకు సైన్యాధికారులకు మధ్య వైరం ఏర్పడుతుంది. ఈ సంవత్సర అధిపతి శని అవటం వలన తక్కవ వర్షపాతం ఉంటుంది. ప్రజలు వ్యాధులు, సమస్యలతో బాధింప బడతారు. దేశానికి ఉత్తర ప్రాంతంలో కరువు ఏర్పడుతుంది. తూర్పు ప్రాంతంలో మంచి పంటలు పండుతాయి. పాలకుల రక్షణ వ్యవస్థ కుంటుపడుతుంది. చైత్ర, వైశాఖ మరియు జ్యేష్ట మాసాల్లో ధరలు పెరుగుతాయి. శ్రావణ మాసంలో గాలులు అధికంగా ఉంటాయి అలాగే ధాన్యాల ధరలు తగ్గుతాయి. భాద్రపద మాసంలో వర్షాలు అధికంగా పడతాయి. ఆశ్వయుజ మాసంలో వ్యాధులు ప్రబలుతాయి, లోహాల ధరలు తగ్గుతాయి. కార్తీక, మార్గశిర, పుష్య మరియు మాఘ మాసాల్లో కరువు పరిస్థితులుంటాయి. ఫాల్ఘుణ మాసంలో వ్యాధులు ప్రబలటమే కాకుండా పాలకుల మధ్య శతృత్వం పెరుగుతుంది.

రాజాధి నవనాయక నిర్ణయం
ఒక రాజ్యానికి, ఒక ప్రభుత్వానికి ఎలా అయితే మంత్రి మండలి ఉంటుందో, ప్రతి సంవత్సరానికి అలా రాజాధి నవ నాయకులు, ఉప నాయకులు ఉంటారు. ఈ దుర్ముఖినామ సంవత్సరానికి రాజు శుక్రుడు, మంత్రి బుధుడు, సేనాధిపతి , మేఘాధిపతి మరియు అర్ఘాధిపతి కుజుడు, సస్యాధిపతి మరియు నీరసాధిపతి శని, ధాన్యాధిపతి గురువు.


https://www.onlinejyotish.com/telugu-astrology/year/index.php

Monday, April 4, 2016

దుర్ముఖీ నామ సంవత్సరం - రాశిఫలాలు

దుర్ముఖీ నామ సంవత్సరం - రాశిఫలాలు
మేష రాశి అష్టమ శని, అగష్ట్ నుంచి గురు బలం తగ్గుతుంది - ఉద్యోగంలో మార్పులు
వృషభ రాశి, సప్తమ శని, అగష్ట్ నుంచి గురుబలం ఆరంభ మవుతుంది. - ఆర్థికాభివృద్ధి, శుభకార్యాలు
మిథున రాశి, ఆరవ ఇంట శని, అర్దాష్టమ గురువు - ఉద్యోగాభివృద్ధి
కర్కాటక రాశి, ఐదవ ఇంట శని, అగష్ట్ తర్వాత గురుబలం తగ్గుతుంది - ప్రయాణాలు, మార్పులు
సింహ రాశి, అర్దాష్టమ శని, అగష్ట్ నుంచి గురుబలం ఆరంభమవుతుంది - ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది
కన్యారాశి, మూడింట శని, అగష్ట్ నుంచి జన్మ గురువు - వృత్తికి అనుకూలం
తులారాశి, 2వ ఇంట శని, అగష్టు నుంచి గురుబలం తగ్గుతుంది - ఖర్చులు, మార్పులు
వృశ్చిక రాశి, జన్మ శని, అగష్ట్ నుంచి గురు బలం - ఆదాయం, వివాహ యోగం
ధనూ రాశి, వ్యయ శని, ఆగష్ట్ నుంచి 10వ ఇంట గురువు - వృత్తిలో మార్పు
మకర రాశి, 11వ ఇంట శని, 9వ ఇంట గురువు - లాభాలు, అభివృద్ధి
కుంభ రాశి, 10వ ఇంట శని, అగష్ట్ నుంచి అష్టమ గురువు - ఖర్చులు, వృత్తిలో మార్పు
మీన రాశి, 9వ ఇంట శని, 7వ ఇంట గురువు - స్థల మార్పు, అభివృద్ధి

పూర్తి రాశిఫలాలు ఉగాది నుంచి https://www.onlinejyotish.com లో అందుబాటులో ఉంటాయి.

రాశులు, అనుకూలించే దేవతారాధన

రాశులు, అనుకూలించే దేవతారాధన
మేష రాశి - అధిపతి కుజుడు, సుబ్రహ్మణ్య, నృసింహ ఆరాధన
వృషభ రాశి - అధిపతి శుక్రుడు, లక్ష్మీ, ఇంద్రాణీ ఆరాధన
మిథున రాశి - అధిపతి బుధుడు, విష్ణు ఆరాధన, రామాయణ పారాయణం
కర్కాటక రాశి - అధిపతి చంద్రుడు, పార్వతి, దుర్గా ఆరాధన
సింహ రాశి, అధిపతి సూర్యుడు, శివ ఆరాధన, నమక, చమక పారాయణం
కన్యారాశి, అధిపతి బుధుడు, విష్ణు ఆరాధన, వెంకటేశ్వర ఆరాధన
తులారాశి, అధిపతి - శుక్రుడు, లక్ష్మీ ఆరాధన, శ్రీ సూక్త పారాయణం
వృశ్చిక రాశి అధిపతి కుజుడు, నృసింహ ఆరాధన, దుర్గా ఆరాధన
ధను రాశి, అధిపతి - గురువు, గురు ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన, గురు చరిత్ర పారాయణం
మకర రాశి, అధిపతి శని, హనుమాన్ ఆరాధన, శివారాధన
కుంభరాశి, అధిపతి శని, వేంకటేశ్వర ఆరాధన,
మీన రాశి, అధిపతి గురువు, గురు ఆరాధన, సాయి ఆరాధన