Tuesday, December 31, 2013

Monthly Rashiphal (Rashifal) January 2014

January 2014 Rashiphal updated at onlinejyotish.com. Click here for January 2014 Monthly Rashiphal
These rashi phal are based on Moon sign (Janma Rashi). If you don't know your Moon sign you can check it here.
Click here to find your rashi, nakshatra
If you want to know how will be year 2014 for you, you can check it here.

Click here 2014 Year Rashiphal based on Moon sign.

Wednesday, November 20, 2013

సంతాన దోషాలు - నివారణోపాయాలు

మనిషిని బాధించే సమస్యలలో సంతానం ప్రధానమైనది. ఏం సాధించినా, ఎంత సంపాదించినా వారసులు లేకుంటే ఆ
అనందం అనేది ఉండదు. సంతానం అలస్యమవటానికి జాతకరీత్యాగల కారణాలను ఒకసారి పరిశీలిద్దాం.

జాతక చక్రంలో పంచమ భావం సంతాన స్థానం గా చెప్పబడింది. అలాగే గురువు సంతాన కారకుడిగా చెప్పబడ్డాడు.
వీటితో పాటు, కుటుంభ స్థానం (2వ భావం), లాభ స్థానం(11వ భావం), భాగ్య స్థానం(9వ భావం), కళత్ర
స్థానం(7వ భావం) మరియు ఆయు స్థానం (8వ భావం) అలాగే గ్రహాల్లో, గురువు తో పాటు కుజ, శుక్రుల
స్థితి కూడా ప్రాధాన్యత కలిగి ఉంటుంది.
ఇప్పుడు జాతక రీత్యా సంతానం ఆలస్యం అవటానికి కల కారణాలను పరిశీలిద్దాం:
1. పంచమ స్థానం చెడిపోవటం
పంచమం లో పాప గ్రహాలు అంటే శని, రాహు, కేతు, సూర్య లేదా కుజ గ్రహాల స్థితి, షష్ట, అష్టమ లేదా
వ్యయ స్తానాదిపతి పంచమంలో స్థితి పొందటం, పంచమాధిపతి నీచస్తానంలో ఉండటం, లేదా పాప గ్రహ యుతి,
వీక్షణలు కలిగి ఉండటం.

2. కారకులు చెడిపోవటం
సంతాన కారకులైన గురువు, శుక్రుడు లేదా కుజుడు నీచ స్థానంలో ఉండటం, లేదా బాల్య లేదా మృత
అవస్తలో ఉండటం, రాహువు తో కలిసి ఉండటం, అష్టమ, వ్యయాల్లో ఉండటం

3. ఇతర సంతానానికి కారకమయ్యే భావాలు, భావాదిపతులు చెడిపోవటం లేదా బలహీనంగా ఉండటం
సంతానానికి ద్వితీయ శ్రేణి కారక భావాలు అంటే పైన చెప్పిన 2, 7, 8, 9 లేదా 11వ భావాల్లో పాప గ్రహాలు
ఉండటం, లేదా ఆయా భావాదిపతులు పాప గ్రహాలతో కలిసి ఉండటం లేదా పాప గ్రహ ద్రుష్టి కలిగి ఉండటం లేదా నీచ
స్థానంలో ఉండటం లేదా బాల్య, మృతావస్థలలో ఉండటం

4. పితృ దోషం
జాతకం లో సూర్య, రాహువులు కలిసి ఉండటం, ముఖ్యంగా పంచమ, భాగ్య స్థానాలలో ఈ కలయిక ఉంటే సంతానం
ఆలస్యం అవుతుంది.

5. సర్ప దోషం
పంచమంలో రాహు స్థితి లేదా పంచామాధిపతి రాహు లేదా కేతువు తో కలిసి ఉండటం, కుజ రాహు యుతి లేదా శని
రాహు యుతి సర్ప దోషం కారణంగా సంతానం అలస్యమవటాన్ని సూచిస్తుంది.

ఇవే కాకుండా పరాశరుడు చెప్పిన భ్రాత్రు, మాతృ, శత్రు తదితర శాపాల కారణంగా కూడా సంతానం ఆలస్యమవుతుంది.

ఈ దోషాల పరిహారానికి కింద ఇవ్వబడిన పరిహార క్రియలు సాయపడతాయి.

గ్రహ దోష నివారణకు అంటే ఆయా గ్రహాలు చెడిపోయి లేదా బలహీనంగా ఉన్నప్పుడు ఆయా గ్రహాలకు జప, హోమాదులు
ఆచరించటం వలన ఆ దోష నివారణ జరిగి సంతానం కలుగుతుంది.

పితృ దోష నివారణకు నారాయనబలి ఆచరించటం అలాగే ఒక సంవత్సరం పాటు ప్రతి అమావాస్యకు బ్రాహ్మణునికి
పితరుల పేరున భోజనం పెట్టడం వలన ఈ దోష నివారణ జరుగుతుంది.

సర్ప దోషానికి సర్పశాంతి చేపించటం అలాగే సర్ప ఆరాధన చేయటం, శివారాధన చేయటం వలన దోష నివారణ జరిగి
సంతానం అవుతుంది.




--
Best Regards
SKSharma,
Om Sri Sai Jyotisha Vidyapeetham,
http://onlinejyotish.com

Thursday, November 14, 2013

శని ప్రభావాన్ని ఎదుర్కోవటం ఎలా?

గ్రహాలన్నింటిలోకి మనిషికి ఎక్కువగా భయపెట్టే గ్రహం శని. శని పాప గ్రహం అవటం, మనిషి కష్టాలకు కారణం
అవటం, గోచారంలో మిగత అన్ని గ్రహలకంటే నెమ్మదిగా సంచరిచటం తద్వారా మనిషి జీవితం పై ఎక్కువ ప్రభావం
చూపించటం ఈ భయానికి కారణాలు. ఎల్నటి శని వస్తోంది అంటే చాలా మందికి ఒకలాంటి భయం మొదలవుతుంది.
ఎటువంటి సమస్యలు వస్తాయో, వాటిని ఎలా ఎదుర్కొనాలో అని చాలామంది ఆందోళనకు గురి అవుతారు.
గోచార రీత్యా శని మన రాశి నుంచి 12, 1 మరియు రెండవ స్థానాల్లో సంచారం చేసినప్పుడు దాన్ని ఏల్నాటి శని
అని, సాడేసాథ్ అని పిలుస్తారు. అలాగే శని 4వ ఇంట్లో సంచరించినప్పుడు దాన్ని అర్దాష్టమ శనిగా, 8వ ఇంట్లో
సంచరించినప్పుడు అష్టమ శని గా చెపుతారు. ప్రధానంగా ఈ 5భావాల్లో శని సంచారం అంతగా అనుకూలించదు.
శని ఒక రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు.
శని పన్నెండవ ఇంటిలో సంచరించినప్పుడు ఆర్ధిక సమస్యలు పెరగటం, నష్టాలు రావటం, విదేశాలకు వెళ్లి
అక్కడ కష్టాల పాలు అవటం, ఇంటికి దూరం అవటం, శత్రుభయం పెరగటం మొదలైన సమస్యలు ఉంటాయి. శని
జన్మాన ఉన్నప్పుడు గౌరవభంగం, అనారోగ్యం, సౌఖ్యలేమి, వృత్తిలో సమస్యలు మొదలైన ఫలితాలుమ్తాయి. శని
రెండవ ఇంటిలో సంచారిస్తున్నప్పుడు కుటుంబ కలహాలు, కుటుంబ సభ్యులకు అనారోగ్యం తద్వారా ఖర్చులు
పెరగటం, ఆదాయం తగ్గటం, మాటకు విలువ లేకపోవటం మొదలైన ఫలితాలు ఉంటాయి. శని నాలగవ ఇంటిలో
సంచారిమ్చేప్పుడు సౌఖ్యలేమి, వాహన సంబంధ ప్రమాదాలు, ఇంటికి దూరం అవటం, వృత్తిలో సమస్యలు మొదలైన
ఫలితాలుమ్తాయి. శని 8వ ఇంట్లో సంచరించే సమయంలో అనుకోని ప్రమాదాలు జరగటం, మానసికంగా అశాంతికి గురి
అవటం, వైవాహిక జీవితంలో సమస్యలు, చెడు అలవాట్లకు బానిస అవటం మొదలైన ఫలితాలు ఉంటాయి.
నిజానికి శని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. శని మన కర్మ ఫలితాన్ని తొలగించే గ్రహం. శని
కారణంగా వచ్చే ప్రతి సమస్య భవిష్యత్తులో మంచి జరగటానికే ఉపయోగపడుతుంది తప్ప చెడు చేయదు.
శని ఇచ్చే చెడు ప్రభావాని తగ్గించుకోవటానికి శివ ఆరాధన, హనుమాన్ ఆరాధన లేదా వెంకటేశ్వర ఆరాధన మంచివి.
శని మంత్ర జపం చేయటం, శనికి తైలాభిషేకం చేయటం, ఆరోగ్య సమస్యలు ఉంటే త్రయంబక మంత్రం జపం చేయటం
వలన శని ప్రభావం తగ్గుతుంది.
దైవ ఆరాధనతో పాటుగా శని ప్రభావం తగ్గటానికి శారీరక శ్రమ చేయటం, సేవ చేయటం (ముఖ్యంగా వృద్దులకు),
అన్నదానం చేయటం చాల మంచిది. దీని వలన శని ప్రభావం తగ్గటమే కాకుండా ఎన్నో శుభఫలితాలు ఏర్పడతాయి.

--
Best Regards
SKSharma,
Om Sri Sai Jyotisha Vidyapeetham,
http://www.onlinejyotish.com

Tuesday, November 12, 2013

వివాహం ఎందుకు ఆలస్యమవుతుంది

ఈ రోజుల్లో ఉద్యోగం తర్వాత యువతను ప్రధానంగా బాధిస్తున్న సమస్య వివాహం. చాల మందికి అన్ని రకాల
అర్హతలు ఉండి వివాహం ఆలస్యం అవుతుంటుంది. ఎన్ని సంబంధాలు చూసినా కుదరక పోవటం,
తల్లిదండ్రులకు, పిల్లలకు ఇదొక పెద్ద సమస్యల తయారవటం జరుగుతోంది. అసలు వివాహం ఆలస్యం అవటానికి
జాతకరీత్యా గల కారణాలని పరిశీలిద్దాం.
వివాహం ఆలస్యం అవటానికి మొదటి కారణం కుజ దోషం. జాతకం లో కుజుడు 1, 4, 7, 8 లేదా 12 వ ఇంట్లో
ఉంటే కుజ దోషం ఉన్నట్టు. కుజుడు అడ్డంకులను ఇచ్చే గ్రహం, అది ఒక్క వివాహమే కాదు ప్రతి విషయం
లో కూడా ఎదో ఒక విధంగా అడ్డుపడుతూ ఉంటుంది. పైన చెప్పిన భావాల్లో కుజుడు ఉండటం వలన వివాహం
ఆలస్యమవుతుంది.
కుజుడు శనితో కలిసి ఉన్నా, నీచ స్థానంలో ఉన్న, వక్రించి ఉన్న కూడా వివాహం ఆలస్యం అవటం జరుగుతుంది.
రెండవ కారణం శుక్రుడు. శుక్రుడు వివాహానికి, వైవాహిక జీవితానికి కారకుడు. జాతకం లో శుక్రుడు
అనుకూలంగా లేకుంటే అంటే నీచ స్థానంలో ఉన్నా, కుజుడితో కలిసి ఉన్నా, 6 వ ఇంట్లో ఉన్నా, లేక రాహు
కేతువులతో కలిసి ఉన్న కూడా వివాహం ఆలస్యం అవుతుంది.
మూడవ కారణం సప్తమ స్థానం చెడిపోవటం అంటే సప్తమ స్థానాధిపతి నీచలో ఉండటం లేదా పాప గ్రహాలతో కలిసి
ఉండటం వలన కూడా వివాహం ఆలస్యమవుతుంది.
నాలగవ కారణం అష్టమ స్థానం చెడిపోవటం. అష్టమ స్థానం మాంగల్య స్థానంగా చెప్పా బడ్డది. ఈ భావాధిపతి నీచ
పట్టినా లేక పాప గ్రహాలతో కలిసి ఉన్నా వివాహం ఆలస్యమవుతుంది.
వివాహం అవటానికి ఈ గ్రహాలకు పరిహార క్రియలు అంటే గ్రహ జప హోమాదులు చేపించటం మంచిది. దీని వలన ఆయా
గ్రహదోష ప్రభావం తగ్గిపోయి వివాహానికి సంబంధించి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి.
వివాహం ఆలస్యమవుతోంది అంటే చాల మంది పగడం పెట్టుకోమని లేదంటే కాళహస్తి లో పూజలు చేపించుకోమని
చెపుతారు. ఇది ఏమాత్రం సరైనది కాదు, కుజ దోషానికి పగడం పరిహారం కాదు. అలాగే కాళహస్తి రాహు, కేతు
సంబంధ దోషానికి పరిహారం కాని కుజ దోషానికి కాదు.
--
Best Regards
SKSharma,
Om Sri Sai Jyotisha Vidyapeetham,
http://onlinejyotish.com

Thursday, October 17, 2013

రత్న ధారణ - వాస్తవాలు

టీవీ చూసే ప్రతివారికి పొద్దున్న లేవగానే ప్రతి ఛానల్ లో ఎవరో ఒకరు రత్నాల గురించి ఊదర కొడుతూనే
ఉంటారు. వాళ్ళ రత్నాలు ధరిస్తే జీవితం మారిపోతుంది అని, పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది, అని, సంతానం
లేని వారికి సంతానం అవుతుంది, దురద్రుస్తావంతులకు అదృష్టం కలిసి వస్తుంది అని అని ఇలా ఉన్నవి
లేనివి అన్ని కల్పించి చెప్పేస్తుంటారు. అసలు రత్నదారణలో నిజానిజాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం.
మన ప్రాచిన జ్యోతిష శాత్రవేత్తలు ప్రతి గ్రహానికి ఒక రత్నాన్ని సూచించారు. సుర్య్నికి కెంపును, చంద్రునికి
ముత్యాన్ని, కుజునికి పగడాన్ని, బుధునికి పచ్చను, గురువుకు పుష్యరాగాన్ని, శుక్రునికి వజ్రాన్ని,
శనికి నీలాన్ని, రాహువుకు గోమేదికాన్ని మరియు కేతువుకు వైడూర్యాన్ని ఆయా గ్రహాల రత్నాలుగా సూచించారు.
రత్నధారణకు చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. కొంతమంది జ్యోతిష్కులు చెడుప్రదేశాల్లో ఉన్న గ్రహానికి రత్నాన్ని
సూచిస్తారు. కానీ నా దృష్టిలో అది సరైన పధ్ధతి కాదు, ఒక గ్రహం మనకు అనుకూలంగా ఉండి బలహీనంగా
ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన రాయి ధరించటం వలన దానికి సంబంధించిన శుభఫలితాలు పెరుగుతాయి.
ఉదాహరణకు ఒక గ్రహం మనకు ఉద్యోగాన్ని ఇచ్చేదిగా ఉండి బలహీనంగా ఉన్నప్పుడు దానికి సంబంధించైనా రాయి
ధరించటం వలన ఉద్యోగం దొరకటం కానీ, లేదా ప్రమోషన్ లాంటివి దొరకటం కానీ జరుగుతాయి. కానీ ఈ రాయి వివాహ
విషయంలో ఇబ్బందుల్ని కలగజేసే అవకాశం ఉంటుంది కాబట్టి సరైన సైజు లో నిర్ణీత సమయం వరకు మాత్రమే
ధరించాలి. అలాగే వివాహ కారకమైన రాయి ఆరోగ్యసమస్యలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక రాయి ఎంత మంచిదో అంత
చెడ్డది కూడా.
చాలామంది వివాహం కావటం లేదు అంటే పగడం పెట్టుకోమని, ఎల్నటి శని నడుస్తోంది అంటే నీలం పెట్టుకోమని
సలహా ఇస్తారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. అది లేని సమస్యలను ఇస్తుంది.
అలాగే జాతకం లేనప్పుడు ఏ రాయి ధరించక పోవటమే మంచిది. పేరు మీద లేదా, రాశి ప్రకారం లేదా నక్షత్ర
ప్రకారం ఎప్పుడు కూడా రాళ్ళను పెట్టుకోకూడదు. జాతకం పరిశీలన చేయకుండా రాయిపెట్టుకోవటం అంటే సరైన
వైద్య పరీక్ష లేకుండా మందులు వాడటం లాంటిది.
అలాగే అదృష్ట రత్నాలు అంటే ఏమి ఉండవు. అలా చెపుతున్నారు అంటే వాళ్ళు మన బలహీనతను కాష్
చేసుకుంటున్నారు అని అర్థం.
అదృష్టాన్ని కొనుక్కోవాలనుకోవటం కంటే మూర్ఖత్వం, అమాయకత్వం మరోటి ఉండదు.

--
Best Regards
SKSharma,
Om Sri Sai Jyotisha Vidyapeetham,
http://onlinejyotish.com

Wednesday, October 16, 2013

కాలసర్ప యోగం - నిజానిజాలు

ఈ మధ్య ఏ ఛానల్ లో చూసినా, ఏ పత్రికలో చూసినా కాలసర్పయోగం గురించి చెపుతున్నారు. కలసర్పయోగం
అనేసరికి అదేదో జీవితాన్ని నాశనం చేసే దానిలా, అది ఉంటే ఇంక ఆ వ్యక్తీ అభివృద్దిలోకి రాడు అని ఇలా చాలా
రకాలుగా చెపుతున్నారు. ఇంకొంతమంది ప్రముఖ(?) జ్యోతిష్కులు తుమ్మినా, దగ్గినా దానికి కారణం కాలసర్ప
దోషం అనే చెపుతున్నారు. పెళ్లి కాకున్నా, ఉద్యోగం రాకున్నా, ఏ సమస్య అయిన దానికి కారణం కాలసర్ప దోషం
అని చెపుతూ జనాలను భయానికి గురి చేస్తున్నారు.
కాలసర్ప యోగం అంటే జాతకచక్రంలో రాహు, కేతువులకు మధ్యన అన్ని గ్రహాలు ఉండటం. ఇది తప్ప అర్ధ
కాల సర్పాలు, పావు కాలసర్పాలు అంటూ ఉండవు. ఒకవేళ మీకు అలా ఎవరైనా చెప్పారు అంటే వాళ్ళు
జ్యోతిష్కులు కాదు అని అర్థం చేసుకోండి.
నిజానికి కాలసర్ప దోషం అంత భయంకరమైనది ఏమి కాదు, అది ఉండటం వలన జీవితంలో అభివృద్ధి ఉండదు అనేది
అన్ని వేళలా నిజం కాదు. 144 రకాల కాలసర్ప యోగాలలో కొన్ని మాత్రమె అభివృద్దికి ఆటంకం చేస్తాయి. మిగిలినవి
అంతగా బాధించవు. చిరంజీవి, జవహర్ లాల్ నెహ్రు మొదలైన వారు కూడా కాలసర్ప దోషం కలిగి ఉన్న వాళ్ళే.
పరాశరుడు మొదలైన ప్రాచీన జ్యోతిష్కులు కాలసర్ప యోగం గురించి చెప్పలేదు.
కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో, సినిమాల్లో, అద్యత్మికంగా బాగా రాణిస్తారు. దోష ప్రభావం
ఉన్నప్పుడు దానికి ఎన్నో రకాల నివారణోపాయాలు ఉన్నాయి. దోషం లేని జాతకులు కాలసర్ప దోషానికి ఎన్ని శాంతులు
చేసిన ప్రయోజనం ఉండదు.

--
Best Regards
SKSharma,
Om Sri Sai Jyotisha Vidyapeetham,
http://onlinejyotish.com

Tuesday, October 15, 2013

శకునాలు - ఎలా చూడాలి

జ్యోతిష శాస్త్రంలో శకునాలు అతి ముఖ్యమైన విభాగం. ఫలితాన్ని చెప్పటానికి జన్మకుండలి ఎంత ముఖ్యమో
శకునాలను గమనించటం కూడా అంటే ముఖ్యం. ప్రకృతికి మనిషికి ఉన్న సంబంధాన్ని గమనించిన మన
పూర్వికులు శకున శాస్త్రాన్ని అభివృద్ధి పరిచారు. దీని ద్వారా ఒక పని తలపెట్టినప్పుడు ఏర్పడ్డ శాకునాన్ని
బట్టి పని అవుతుందా కాదా లేక ఎటువంటి ఫలితం వస్తుంది అనేది అంచనా వేయవచ్చు.
బల్లి శకునం, కాకి శకునం, పిల్లి శకునం ఇలా చాలా ఉన్నాయి. ప్రతి దానికి ఒక విశేషతా ప్రాధాన్యత ఉన్నది.
దీన్ని చాల మంది తేలికగా తీసుకుంటారు, కానీ అనుభవానికి వస్తే అసలు విషయం బోధపడుతుంది.
శకునాలను గురించి ప్రతి పంచాంగంలో ఇస్తారు అయితే చాలా మంది శకునం గురించి సరైన అవగాహన లేక ప్రతిది
శకునంగానే భావిస్తారు. ఉదాహరణకి బల్లి శకునం, బల్లి శరీరం మీద పడితే పడిన ప్రశాన్ని బట్టి ఫలితం
ఉంటుంది. అయితే అది అసంకల్పంగా జరిగినప్పుడే ఫలితం వస్తుంది కానీ, బల్లి ఉండే చోట కూర్చొని అది పడితే
దాన్ని శకునంగా భావించే అవసరం లేదు. అలాగే పిల్లి అడ్డు రావటం కూడా, ఇంట్లో ఉండే పెంపుడు పిల్లి
అడ్డు రావటం శకునం కాదు.
శకునం అనేది అసంకల్పితంగా జరిగినప్పుడే అది ఫలితం ఇస్తుంది తప్ప మనం ప్రేరేపించి జరిగేల చుస్తే అది
శకునం కాదు. ముఖ్యంగా శకునాలు ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు జరిగినా లేక ఏదైనా ముఖ్యమైన
ప్రయాణానికి బయల్దేరే ముందు జరిగినా దాన్ని పట్టించుకోవాలి తప్పితే రోజువారి కార్యక్రమాలకు శాకునాన్ని పాటించే
అవసరం లేదు. పాటించినా ఫలితం ఉండదు.
--
Best Regards
SKSharma,
Om Sri Sai Jyotisha Vidyapeetham,
http://onlinejyotish.com

Sunday, October 13, 2013

ఓం శ్రీ సాయి జ్యోతిష విద్యాపీఠం బ్లాగ్ కు స్వాగతం

నమస్కారం!
గత పది సంవత్సరాలుగా నా వెబ్ సైట్ onlinejyotish.com ను ఆదరిస్తున్న అందరికి నా హృదయ పూర్వక
కృతఙ్ఞతలు. ఈ విజయదశమితో నేను జ్యోతిష్యం నేర్చుకోవటం ఆరంభించి 17 సంవత్సరాలు అవుతోంది. 1996
లో ఇదే రోజున జ్యోతిషం నేర్చుకోవాలనే సంకల్పం కలిగి ఆరోజే నేర్చుకోవటం ఆరంభించటం జరిగింది. జ్యోతిషం
జీవితకాల విద్య దీనికి ప్రారంభమే తప్ప ముగింపు ఉండదు. ప్రతి జాతకం ఒక పాఠమె. ఈ సంవత్సరం విజయదశమి
రోజునుంచి ఈ బ్లాగ్ ద్వారా జ్యోతిష సంబంధ విషయాలు, ఇతర విషయాలు అందరితో పంచుకోవటానికి సంకల్పించాను.
వీలున్నప్పుడల్లా ఇక్కడ పోస్ట్ లు పెడుతుంటా...
కృతఙ్ఞతలు......
--
Best Regards
SKSharma,
Om Sri Sai Jyotisha Vidyapeetham,
http://onlinejyotish.com

Saturday, October 12, 2013

Welcome to Om Sri Sai Jyotisha Vidyapeetham

Namaste! Welcome to Om Sri Sai Jyotisha Vidyapeetham blog. Here in this blog you can find latest o\updates about onlinejyotish.com and Om Sri Sai Jyotisha Vidyapeetham. You can find Puja yagya details performed at Om Sri Sai Jyotisha Vidyapeetham.

Om Sri Sai Jyotisha Vidyapeetham is established in 2004 with the aim to serve people through Vedic Astrology, a divine science given by our sages. onlinejyotish.com is the official website of Om Sri Sai Jyotisha Vidyapeetham, Through this website we are giving various Astrology, Numerology and remedial services for Indian and abroad people. We are offering various paid Astrology services like horoscopes, Forecast reports, Muhurta service, and consultations for better and detailed analysis and many more.. in free service section you can find free horoscope, Kundli Matching, panchang for your place, Rashiphal, numerology, name calculator and many more... We are trying to add more free services very soon. For those who are interested in learning Astrology and Vastu, you can find Astrology and Vastu lessons. We are adding some more lessons and articles very soon. Go through the website to find more. Do give your feedback which helps us to serve you better.
Now onlinejyotish.com works on any device. This is the first Astrology webiste designed in responsive method. You can visit this website on desktop, mobile or tablet. Also started new services like Telugu Panchangam, Gunamelanam in Telugu, Numerology in Telugu etc... In coming days launching new free services like online KP Horoscope, online Lalkitab reading, online Nadi Reading etc..