Wednesday, October 16, 2013

కాలసర్ప యోగం - నిజానిజాలు

ఈ మధ్య ఏ ఛానల్ లో చూసినా, ఏ పత్రికలో చూసినా కాలసర్పయోగం గురించి చెపుతున్నారు. కలసర్పయోగం
అనేసరికి అదేదో జీవితాన్ని నాశనం చేసే దానిలా, అది ఉంటే ఇంక ఆ వ్యక్తీ అభివృద్దిలోకి రాడు అని ఇలా చాలా
రకాలుగా చెపుతున్నారు. ఇంకొంతమంది ప్రముఖ(?) జ్యోతిష్కులు తుమ్మినా, దగ్గినా దానికి కారణం కాలసర్ప
దోషం అనే చెపుతున్నారు. పెళ్లి కాకున్నా, ఉద్యోగం రాకున్నా, ఏ సమస్య అయిన దానికి కారణం కాలసర్ప దోషం
అని చెపుతూ జనాలను భయానికి గురి చేస్తున్నారు.
కాలసర్ప యోగం అంటే జాతకచక్రంలో రాహు, కేతువులకు మధ్యన అన్ని గ్రహాలు ఉండటం. ఇది తప్ప అర్ధ
కాల సర్పాలు, పావు కాలసర్పాలు అంటూ ఉండవు. ఒకవేళ మీకు అలా ఎవరైనా చెప్పారు అంటే వాళ్ళు
జ్యోతిష్కులు కాదు అని అర్థం చేసుకోండి.
నిజానికి కాలసర్ప దోషం అంత భయంకరమైనది ఏమి కాదు, అది ఉండటం వలన జీవితంలో అభివృద్ధి ఉండదు అనేది
అన్ని వేళలా నిజం కాదు. 144 రకాల కాలసర్ప యోగాలలో కొన్ని మాత్రమె అభివృద్దికి ఆటంకం చేస్తాయి. మిగిలినవి
అంతగా బాధించవు. చిరంజీవి, జవహర్ లాల్ నెహ్రు మొదలైన వారు కూడా కాలసర్ప దోషం కలిగి ఉన్న వాళ్ళే.
పరాశరుడు మొదలైన ప్రాచీన జ్యోతిష్కులు కాలసర్ప యోగం గురించి చెప్పలేదు.
కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో, సినిమాల్లో, అద్యత్మికంగా బాగా రాణిస్తారు. దోష ప్రభావం
ఉన్నప్పుడు దానికి ఎన్నో రకాల నివారణోపాయాలు ఉన్నాయి. దోషం లేని జాతకులు కాలసర్ప దోషానికి ఎన్ని శాంతులు
చేసిన ప్రయోజనం ఉండదు.

--
Best Regards
SKSharma,
Om Sri Sai Jyotisha Vidyapeetham,
http://onlinejyotish.com

1 comment:

  1. Sharma garu,
    namaskaramulu

    kalasarpadoshamulu gurinchi
    galli galli ki computers pettukunna brathukugadupuchunna varu
    janalani baga bayapettisthunnaru

    ReplyDelete

Thanks for your comment.