Thursday, October 17, 2013

రత్న ధారణ - వాస్తవాలు

టీవీ చూసే ప్రతివారికి పొద్దున్న లేవగానే ప్రతి ఛానల్ లో ఎవరో ఒకరు రత్నాల గురించి ఊదర కొడుతూనే
ఉంటారు. వాళ్ళ రత్నాలు ధరిస్తే జీవితం మారిపోతుంది అని, పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది, అని, సంతానం
లేని వారికి సంతానం అవుతుంది, దురద్రుస్తావంతులకు అదృష్టం కలిసి వస్తుంది అని అని ఇలా ఉన్నవి
లేనివి అన్ని కల్పించి చెప్పేస్తుంటారు. అసలు రత్నదారణలో నిజానిజాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం.
మన ప్రాచిన జ్యోతిష శాత్రవేత్తలు ప్రతి గ్రహానికి ఒక రత్నాన్ని సూచించారు. సుర్య్నికి కెంపును, చంద్రునికి
ముత్యాన్ని, కుజునికి పగడాన్ని, బుధునికి పచ్చను, గురువుకు పుష్యరాగాన్ని, శుక్రునికి వజ్రాన్ని,
శనికి నీలాన్ని, రాహువుకు గోమేదికాన్ని మరియు కేతువుకు వైడూర్యాన్ని ఆయా గ్రహాల రత్నాలుగా సూచించారు.
రత్నధారణకు చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. కొంతమంది జ్యోతిష్కులు చెడుప్రదేశాల్లో ఉన్న గ్రహానికి రత్నాన్ని
సూచిస్తారు. కానీ నా దృష్టిలో అది సరైన పధ్ధతి కాదు, ఒక గ్రహం మనకు అనుకూలంగా ఉండి బలహీనంగా
ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన రాయి ధరించటం వలన దానికి సంబంధించిన శుభఫలితాలు పెరుగుతాయి.
ఉదాహరణకు ఒక గ్రహం మనకు ఉద్యోగాన్ని ఇచ్చేదిగా ఉండి బలహీనంగా ఉన్నప్పుడు దానికి సంబంధించైనా రాయి
ధరించటం వలన ఉద్యోగం దొరకటం కానీ, లేదా ప్రమోషన్ లాంటివి దొరకటం కానీ జరుగుతాయి. కానీ ఈ రాయి వివాహ
విషయంలో ఇబ్బందుల్ని కలగజేసే అవకాశం ఉంటుంది కాబట్టి సరైన సైజు లో నిర్ణీత సమయం వరకు మాత్రమే
ధరించాలి. అలాగే వివాహ కారకమైన రాయి ఆరోగ్యసమస్యలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక రాయి ఎంత మంచిదో అంత
చెడ్డది కూడా.
చాలామంది వివాహం కావటం లేదు అంటే పగడం పెట్టుకోమని, ఎల్నటి శని నడుస్తోంది అంటే నీలం పెట్టుకోమని
సలహా ఇస్తారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. అది లేని సమస్యలను ఇస్తుంది.
అలాగే జాతకం లేనప్పుడు ఏ రాయి ధరించక పోవటమే మంచిది. పేరు మీద లేదా, రాశి ప్రకారం లేదా నక్షత్ర
ప్రకారం ఎప్పుడు కూడా రాళ్ళను పెట్టుకోకూడదు. జాతకం పరిశీలన చేయకుండా రాయిపెట్టుకోవటం అంటే సరైన
వైద్య పరీక్ష లేకుండా మందులు వాడటం లాంటిది.
అలాగే అదృష్ట రత్నాలు అంటే ఏమి ఉండవు. అలా చెపుతున్నారు అంటే వాళ్ళు మన బలహీనతను కాష్
చేసుకుంటున్నారు అని అర్థం.
అదృష్టాన్ని కొనుక్కోవాలనుకోవటం కంటే మూర్ఖత్వం, అమాయకత్వం మరోటి ఉండదు.

--
Best Regards
SKSharma,
Om Sri Sai Jyotisha Vidyapeetham,
http://onlinejyotish.com

No comments:

Post a Comment

Thanks for your comment.