Tuesday, November 12, 2013

వివాహం ఎందుకు ఆలస్యమవుతుంది

ఈ రోజుల్లో ఉద్యోగం తర్వాత యువతను ప్రధానంగా బాధిస్తున్న సమస్య వివాహం. చాల మందికి అన్ని రకాల
అర్హతలు ఉండి వివాహం ఆలస్యం అవుతుంటుంది. ఎన్ని సంబంధాలు చూసినా కుదరక పోవటం,
తల్లిదండ్రులకు, పిల్లలకు ఇదొక పెద్ద సమస్యల తయారవటం జరుగుతోంది. అసలు వివాహం ఆలస్యం అవటానికి
జాతకరీత్యా గల కారణాలని పరిశీలిద్దాం.
వివాహం ఆలస్యం అవటానికి మొదటి కారణం కుజ దోషం. జాతకం లో కుజుడు 1, 4, 7, 8 లేదా 12 వ ఇంట్లో
ఉంటే కుజ దోషం ఉన్నట్టు. కుజుడు అడ్డంకులను ఇచ్చే గ్రహం, అది ఒక్క వివాహమే కాదు ప్రతి విషయం
లో కూడా ఎదో ఒక విధంగా అడ్డుపడుతూ ఉంటుంది. పైన చెప్పిన భావాల్లో కుజుడు ఉండటం వలన వివాహం
ఆలస్యమవుతుంది.
కుజుడు శనితో కలిసి ఉన్నా, నీచ స్థానంలో ఉన్న, వక్రించి ఉన్న కూడా వివాహం ఆలస్యం అవటం జరుగుతుంది.
రెండవ కారణం శుక్రుడు. శుక్రుడు వివాహానికి, వైవాహిక జీవితానికి కారకుడు. జాతకం లో శుక్రుడు
అనుకూలంగా లేకుంటే అంటే నీచ స్థానంలో ఉన్నా, కుజుడితో కలిసి ఉన్నా, 6 వ ఇంట్లో ఉన్నా, లేక రాహు
కేతువులతో కలిసి ఉన్న కూడా వివాహం ఆలస్యం అవుతుంది.
మూడవ కారణం సప్తమ స్థానం చెడిపోవటం అంటే సప్తమ స్థానాధిపతి నీచలో ఉండటం లేదా పాప గ్రహాలతో కలిసి
ఉండటం వలన కూడా వివాహం ఆలస్యమవుతుంది.
నాలగవ కారణం అష్టమ స్థానం చెడిపోవటం. అష్టమ స్థానం మాంగల్య స్థానంగా చెప్పా బడ్డది. ఈ భావాధిపతి నీచ
పట్టినా లేక పాప గ్రహాలతో కలిసి ఉన్నా వివాహం ఆలస్యమవుతుంది.
వివాహం అవటానికి ఈ గ్రహాలకు పరిహార క్రియలు అంటే గ్రహ జప హోమాదులు చేపించటం మంచిది. దీని వలన ఆయా
గ్రహదోష ప్రభావం తగ్గిపోయి వివాహానికి సంబంధించి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి.
వివాహం ఆలస్యమవుతోంది అంటే చాల మంది పగడం పెట్టుకోమని లేదంటే కాళహస్తి లో పూజలు చేపించుకోమని
చెపుతారు. ఇది ఏమాత్రం సరైనది కాదు, కుజ దోషానికి పగడం పరిహారం కాదు. అలాగే కాళహస్తి రాహు, కేతు
సంబంధ దోషానికి పరిహారం కాని కుజ దోషానికి కాదు.
--
Best Regards
SKSharma,
Om Sri Sai Jyotisha Vidyapeetham,
http://onlinejyotish.com

No comments:

Post a Comment

Thanks for your comment.