Wednesday, November 20, 2013

సంతాన దోషాలు - నివారణోపాయాలు

మనిషిని బాధించే సమస్యలలో సంతానం ప్రధానమైనది. ఏం సాధించినా, ఎంత సంపాదించినా వారసులు లేకుంటే ఆ
అనందం అనేది ఉండదు. సంతానం అలస్యమవటానికి జాతకరీత్యాగల కారణాలను ఒకసారి పరిశీలిద్దాం.

జాతక చక్రంలో పంచమ భావం సంతాన స్థానం గా చెప్పబడింది. అలాగే గురువు సంతాన కారకుడిగా చెప్పబడ్డాడు.
వీటితో పాటు, కుటుంభ స్థానం (2వ భావం), లాభ స్థానం(11వ భావం), భాగ్య స్థానం(9వ భావం), కళత్ర
స్థానం(7వ భావం) మరియు ఆయు స్థానం (8వ భావం) అలాగే గ్రహాల్లో, గురువు తో పాటు కుజ, శుక్రుల
స్థితి కూడా ప్రాధాన్యత కలిగి ఉంటుంది.
ఇప్పుడు జాతక రీత్యా సంతానం ఆలస్యం అవటానికి కల కారణాలను పరిశీలిద్దాం:
1. పంచమ స్థానం చెడిపోవటం
పంచమం లో పాప గ్రహాలు అంటే శని, రాహు, కేతు, సూర్య లేదా కుజ గ్రహాల స్థితి, షష్ట, అష్టమ లేదా
వ్యయ స్తానాదిపతి పంచమంలో స్థితి పొందటం, పంచమాధిపతి నీచస్తానంలో ఉండటం, లేదా పాప గ్రహ యుతి,
వీక్షణలు కలిగి ఉండటం.

2. కారకులు చెడిపోవటం
సంతాన కారకులైన గురువు, శుక్రుడు లేదా కుజుడు నీచ స్థానంలో ఉండటం, లేదా బాల్య లేదా మృత
అవస్తలో ఉండటం, రాహువు తో కలిసి ఉండటం, అష్టమ, వ్యయాల్లో ఉండటం

3. ఇతర సంతానానికి కారకమయ్యే భావాలు, భావాదిపతులు చెడిపోవటం లేదా బలహీనంగా ఉండటం
సంతానానికి ద్వితీయ శ్రేణి కారక భావాలు అంటే పైన చెప్పిన 2, 7, 8, 9 లేదా 11వ భావాల్లో పాప గ్రహాలు
ఉండటం, లేదా ఆయా భావాదిపతులు పాప గ్రహాలతో కలిసి ఉండటం లేదా పాప గ్రహ ద్రుష్టి కలిగి ఉండటం లేదా నీచ
స్థానంలో ఉండటం లేదా బాల్య, మృతావస్థలలో ఉండటం

4. పితృ దోషం
జాతకం లో సూర్య, రాహువులు కలిసి ఉండటం, ముఖ్యంగా పంచమ, భాగ్య స్థానాలలో ఈ కలయిక ఉంటే సంతానం
ఆలస్యం అవుతుంది.

5. సర్ప దోషం
పంచమంలో రాహు స్థితి లేదా పంచామాధిపతి రాహు లేదా కేతువు తో కలిసి ఉండటం, కుజ రాహు యుతి లేదా శని
రాహు యుతి సర్ప దోషం కారణంగా సంతానం అలస్యమవటాన్ని సూచిస్తుంది.

ఇవే కాకుండా పరాశరుడు చెప్పిన భ్రాత్రు, మాతృ, శత్రు తదితర శాపాల కారణంగా కూడా సంతానం ఆలస్యమవుతుంది.

ఈ దోషాల పరిహారానికి కింద ఇవ్వబడిన పరిహార క్రియలు సాయపడతాయి.

గ్రహ దోష నివారణకు అంటే ఆయా గ్రహాలు చెడిపోయి లేదా బలహీనంగా ఉన్నప్పుడు ఆయా గ్రహాలకు జప, హోమాదులు
ఆచరించటం వలన ఆ దోష నివారణ జరిగి సంతానం కలుగుతుంది.

పితృ దోష నివారణకు నారాయనబలి ఆచరించటం అలాగే ఒక సంవత్సరం పాటు ప్రతి అమావాస్యకు బ్రాహ్మణునికి
పితరుల పేరున భోజనం పెట్టడం వలన ఈ దోష నివారణ జరుగుతుంది.

సర్ప దోషానికి సర్పశాంతి చేపించటం అలాగే సర్ప ఆరాధన చేయటం, శివారాధన చేయటం వలన దోష నివారణ జరిగి
సంతానం అవుతుంది.




--
Best Regards
SKSharma,
Om Sri Sai Jyotisha Vidyapeetham,
http://onlinejyotish.com

No comments:

Post a Comment

Thanks for your comment.