Tuesday, January 28, 2014

అదృష్టవంతులు అవటం ఎలా?

టైటిల్ చూసి ఈ వ్యాసాన్ని ఆసక్తిగా చదువుతున్నారు అంటే, అదృష్టం అనే పదానికి ఉన్న ఆకర్షణ శక్తి
ఎలాంటిదో గుర్తించండి. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి వారి మనసుని తొలిచే ప్రశ్న ఒకటే అదృష్టవంతులు
అవటం ఎలా? అనేది. ప్రతి జ్యోతిష్కునికి ఎదురయ్యే ప్రశ్నలలో మొదటి స్థానం దీనికే ఉంటుంది. ఎం చేస్తే
అదృష్టం వస్తుంది, ఎలా అదృష్టవంతులు అవాలి అనేది. మనిషికి ఉండే ఈ ఒక్క బలహీనతను ఆధారం
చేసుకుని చాలామంది లాభపడుతున్నారు. అదృష్ట రత్నాలు, పేరు మార్చుకుని అదృష్టవంతులు కండి, ఇలా
రకరకాల పద్దతుల్లో జనాలను మోసం చేస్తున్నారు.
జ్యోతిష శాస్త్రం మనిషికి సరైన మార్గాన్ని సూచించి వారి అభివృద్దికి దోహదం చేస్తుంది రప్ప ఇలా అదృష్టం
పేరుతొ బద్దకాన్ని పెంచదు. ఒకవేళ మీకు ఎవరైనా ఇది పెట్టుకుంటే అదృష్టం వస్తుంది లేదా ఇలా చేస్తే
అదృష్టం వస్తుంది అని చెపుతున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని శాస్త్రం పేరు చెప్పి మోసం చేస్తున్నారు అని
అర్థం. అదృష్టాన్ని కొనుక్కోవలనుకోవటం కంటే మూర్ఖత్వం మరోటి ఉండదు. ఇంకో విషయం ఈ మధ్య కాలంలో
చాలామంది టీవీల్లో వచ్చే ప్రకటలను చూసి ఆకర్షితులవుతున్నారు. కనీసం అమ్మే వాళ్ళ అడ్రస్ తెలియని ఆ
వస్తువులు ఎలా నమ్మకమైనవి అవుతాయి. అదృష్ట సంఖ్యలు కానీ, అదృష్ట రత్నాలు కానీ ఇవి లాటరీలు
కొట్టడానికో లేక జూదంలో గెలవటానికో కాదు, అలా అనుకోవటం కరెక్ట్ కూడా కాదు. అవి కేవలం మనకు పాజిటివ్
వైబ్రేషన్ ఇస్తాయి దాని ద్వారా మనకు ఉండే ఆందోళనలు బాధలు తగ్గి జీవితం సరైన పద్ధతిలో నడవటానికి ఉపయోగం
అవుతాయి. టీవీల్లో సంఖ్యా శాస్త్రం పేరుతొ వస్తున్న ప్రకటనలకు కూడా చాలా మంది ఆకర్షితులవుతున్నారు.
నాకు తెలిసినంతవరకు భారతీయ సంఖ్యాశాస్త్రం/ స్వర శాస్త్రం చెప్పిన పేరు మార్పు అనేది పిలిచే పేరులో లేదా
ధ్వనిలో మార్పు, ఇది ఏ భాషకు అయిన వర్తిస్తుంది. ధ్వనికి ఉండే వైబ్రేషన్ ఆధారంగా దీనిని నిర్ణయించాలి.
అంతే కానీ కేవలం స్పెల్లింగ్ మార్చటం అనేది నా దృష్టిలో సరైన పధ్ధతి కాదు. ఒకవేళ స్పెల్లింగ్ మార్చినా అది
పిలవటంలో కూడా మార్పు కనిపించేలా ఉండాలి. అప్పుడు మాత్రమె సరైన వైబ్రేషన్ ఉత్పత్తి అవుతుంది. భారతీయ
స్వర శాస్త్రం మన జాతకానికి అనువైన అక్షరాలను/ధ్వనులను సూచించింది. జాతకానికి అనుకూలంగా పేరు
లేనప్పుడు మనజాతకానికి అనుకూలంగా పేరు మార్చుకోవటం అనేది ఒక పధ్ధతి. అది స్వర శాస్త్రం ఆధారంగా మన
జాతకం ఆధారంగా నిర్ణయించవచ్చు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలు లేకుండా అందరికి ఒకేలా ఫలితం ఇచ్చేది
శాస్త్రం అవుతుంది కానీ, అది ఒక భాషకే పరిమితం అయితే శాస్త్రం అనిపించుకోదు.
ఇక అదృష్టం విషయానికి వస్తే జాతక చక్రంలో 9వ భావం అదృష్ట భావం గా చెప్పబడింది. 10వ భావం కర్మ
స్థానం అంటే మనం చేసే పని, ఉద్యోగం, దాని వ్యయ స్థానం భాగ్యస్థానం అంటే మనం చేసే పనికి ఫలితమే భాగ్యం
కానీ మరోటి కాదు అని దాని అర్థం. కాబట్టి అదృష్టవంతులు కావాలంటే ముందు కర్మకు అంటే పనికి ప్రాధాన్యత
ఇవ్వండి అదృష్టం అదే వస్తుంది.
--
Best Regards
SKSharma,
Om Sri Sai Jyotisha Vidyapeetham,
http://www.onlinejyotish.com

No comments:

Post a Comment

Thanks for your comment.