Thursday, January 9, 2014

మకర సంక్రమణ సమయం - సంక్రాంతి నిర్ణయం

మన ఆంధ్రప్రదేశ్ లో వాడుకలో ఉన్న కొన్ని పంచాంగాలలో గణితం తేడాగా ఉండటం వలన ఈ సంవత్సరం సంక్రాంతి
విషయంలో కొంత సంగిద్గత ఏర్పడింది. పూర్వ గణితం తో లెక్కించబడిన కొన్ని పంచాంగాలు సంక్రమణ సమయం
సరిగా ఇవ్వకపోవటం వలన ఈ సందిగ్దత ఏర్పడింది. నిజానికి పూర్వ గణితం లేదా సూర్య సిద్దాంతం తో
లెక్కించబడిన పంచాంగాలలో గణితం సరిగా ఉండదు దాని కారణంగా మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇలా
పండగలకు, తిథులకు సమస్య ఏర్పడుతున్నది. ప్రామాణికమైన దృక్ గణితాన్ని అందరు వాడినట్లయితే ఈ సమస్య
ఉత్పన్నం కాదు.
ఈ సంవత్సరం సూర్యుడు జనవరి 14 న మధ్యాహ్నం 1గం. 17 నిమిషములకు ప్రవేశిస్తున్నాడు. కాబట్టి
జనవరి 14 రోజునే మకర సంక్రమణం అవుతుంది. పితృ సంబంధ కార్యములు చేసుకునే వారు 14 వ
తారీకునే పితృ సంతర్పణ కావిన్చుకోవాలి. పుణ్యకాల ముహూర్తం మధ్యాహ్నం 1:17 నుంచి సాయంత్రం 5:57
వరకు. మహాపుణ్య కాలం మధ్యాహ్నం 1:17 నుంచి 1:41 వరకు.

--
Best Regards
SKSharma,
Om Sri Sai Jyotisha Vidyapeetham,
http://onlinejyotish.com

No comments:

Post a Comment

Thanks for your comment.