Wednesday, March 22, 2017

హేమలంబ నామ సంవత్సర రాశిఫలములు

హేమలంబ సంవత్సర ఫలం

ఈ హేమలంబ నామ సంవత్సరంలో పంటలు మధ్యమంగా పండుతాయి. పాలకుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. ఆకాశంలో ఉరుములు, మెరుపులు అధికంగా ఉంటాయి కానీ, వర్షపాతం తక్కువగా ఉంటుంది.
ఈ సంవత్సరానికి అధిపతి రాహువు అవటం వలన వర్షాలు తక్కువగా పడతాయి. ప్రజలు రోగాలచే బాధపడతారు. భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు భయభ్రాంతులవుతారు. చైత్ర, వైశాఖ మాసాల్లో ధాన్యం ధరలు తగ్గుతాయి. ప్రజలు బాధలు పడతారు. అలాగే రెండు దేశాల మధ్య యుద్ధం జరగటం కానీ, యుద్ధ వాతావరణం నెలకొనటం గానీ జరుగుతుంది. (రెండు రాష్ట్రాల మధ్య అభిప్రాయభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ మాసాల్లో ధాన్యాల ధరలు పెరుగుతాయి. భాద్రపద మాసంలో వర్షపాతం అధికంగా ఉంటుంది. ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో పాలకులు బలహీనులవుతారు. దాని కారణంగా ప్రజలు క్రూర ప్రవర్తన కలిగి ఉంటారు. లోహాల ధర పెరుగుతుంది. పశు సంబంధ అనారోగ్యాల కారణంగా పశువులు మృత్యువాత పడటం జరుగుతుంది. పుష్య, మాఘ, ఫాల్గుణ మాసాల్లో ప్రజలు ఆనందంగా జీవిస్తారు.

No comments:

Post a Comment

Thanks for your comment.