Saturday, March 19, 2016

శకునాలు: అపోహలు-నిజాలు

శకునాలు: అపోహలు-నిజాలు
జ్యోతిష శాస్త్ర విభాగాల్లో ఒకటైన శకున శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. మనిషికి, ప్రకృతికి ఇతర జీవజాలానికి కల అవినాభావ సంబంధాన్ని తెలియజెప్పే శాస్త్రమిది. ప్రతి సంఘటన వెనుక ఒక అర్థం, పరమార్థం ఉందని తెలియజెపుతుంది. అయితె మనకున్న భయాలు, అపోహలు మూఢ నమ్మకాల కారణంగా ప్రతి దానిని శకునంగా భావించి విపరీత అర్థాలు తీసి లేని అనర్థాలను కొనితెచ్చుకుంటున్నాము. శకున శాస్త్రం మనిషి ప్రకృతికి అనుగుణంగా మసలుతూ సమస్యలు దూరం చేసుకోవటానికి సాయం చేస్తుంది. ఒక పని చేస్తున్నప్పుడు మంచి శకునంతో పాటు చెడు శకునంకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. చెడు శకునం కలిగినప్పుడు మనం చేసే పనిలో ఏదో తప్పు ఉందని, దానిని సరిచేసుకోవాలని ప్రకృతి ఇచ్చే సూచనగా భావించి చేసే పనిని మళ్లీ ఒకసారి పరిశీలించుకోవటం మంచిది. ఒక పని మొదలు పెడుతున్న ప్రతిసారి చెడు శకునం సూచిస్తోంది అంటే ఆ పని మానేయటం మంచిదని అర్థం. అయితే ఈ శకునాల్ని సరిగా అర్థం చేసుకోక అనవసరంగా భయపడతారు. ఒక ప్రయాణం తలపెట్టినప్పుడు పిల్లి ఎదురొచ్చింది అంటే మనం చేసే ప్రయాణం వాయిదా వేసుకోమని లేదా మనం ఏదైనా మరిచి పోయి ప్రయాణం ప్రారంభించామని అర్థం. ఏది మర్చిపోయామో గుర్తుచేసుకోవటానికే ఇలాంటి శకునం ఎదురైనపప్పుడు దైవ ప్రార్థన చేయమని చెప్పేది. పిల్లి అడ్డొచ్చిందని దాన్ని తిట్టడం లేదా అసహ్యించుకోవటం మంచిది కాదు. అలాగే బల్లి శకునం కూడా, ఏదైన ముఖ్యమైన ప్రయాణం చేస్తున్నప్పుడో, లేదా ఏదైనా పని తలపెట్టినప్పుడో బల్లి పలకటం లేదా పైన పడటం జరిగితే అది శకునమవుతుంది. అంతేకాని ఊదికే కూర్చున్నప్పుడు బల్లి పడితే అది శకునం కాదు. ఏదైనా ముఖ్యమైన పని ఆరంభించే ముందు రెండు క్షణాలు కన్ను అదిరితే అది శకునం, పొద్దస్తమానం అదురుతోంది అంటే అది కంటి సమస్యే తప్ప శకునం కాదు. ఏ శాస్త్రమైనా మనిషికి ఉపయోగ పడేదే తప్ప మరోటి కాదు. శాస్త్రం విలువ మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది కాని ఊహించుకునే విధానాన్నిబట్టి కాదు.

No comments:

Post a Comment

Thanks for your comment.