Friday, June 27, 2014

పుష్కరములు

2015 జులై 14 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. ఆ సందర్భంగా పుష్కరాల గురించి
అవగాహన కొరకు మరియు పుష్కరాల్లో ఏమి చేయాలో తెలియజేయటం మరియు గోదావరి పుష్కర స్నానం ఎక్కడ చేయటం
అత్యంత శ్రేష్టం అనే అంశాలు వివరించటం ఈ వ్యాసం యొక్క ఉద్దేశం.
పుష్కరాలు ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. గురువు మేషాది ద్వాదశ రాశుల్లో
సంచారించినప్పుడు ఒక్కో రాశిలో సంచారానికి ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి.
గురువు మేష రాశిలో సంచరించినప్పుడు గంగానదికి పుష్కరాలు వస్తాయి. అలాగే గురువు సింహరాశిలో
సంచారించేప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి.
సింహరాసిలో గురు సంచారం వచ్చే సంవత్సరం జూలై 14వ తేది ఉదయం 5గంటల 45 కు ప్రారంభం
అవుతుంది. అప్పటి నుంచి గోదావరి నదికి పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. గోదావరి నది తెలంగాణా లో
బాసరలో ప్రవేశించి బద్రాచలం దాటాక ఆంధ్రప్రదేశ్ లో ప్రవహిస్తుంది. తెలంగాణాలో బాసర, ధర్మపురి,
భద్రాచలంలలో పుష్కరాలు ఘనంగా జరుగుతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రిలో పుష్కరాలు ఘనంగా
జరుగుతాయి. తెలంగాణలో ఈ మూడు కూడా తీర్థం మరియు క్షేత్రం అవటం మూలాన వీటికి ప్రాధాన్యత ఎక్కువ. ఈ
మూడింటిలో ధర్మపురికి ఒక ప్రత్యెక ప్రాధాన్యత ఉన్నది. ఇక్కడ గోదావరి దక్షిణ వాహిని. రాష్ట్రంలో ఎక్కడ కూడా
గోదావరి దక్షిణానికి ప్రవహించదు. ధర్మపురిలో ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తుంది. దక్షిణం యముడి దిశ
అలాగే ధర్మపురి ప్రధాన దైవం నృసింహుడితో పాటుగా బ్రహ్మ, యములకు పూజలు జరుగుతాయి.
పుష్కరాలలో పితరులకు పిండప్రదానం చేయటం ప్రధాన కార్యక్రమమ. పుష్కరుడు నెలవై ఉన్న నదీ తీరంలో
పిండప్రదానం చేయటం వలన పితరులకు పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయని నమ్మకం. ధర్మపురిలో పిండ ప్రధానం
చేయటం, ముఖ్యంగా పుష్కరాల సమయంలో పిండప్రదానం చేయటం అత్యంత పవిత్రమైనది. అందుకే రాష్ట్రంలోని వివిధ
ప్రమ్తాలనుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఇక్కడకు వచ్చి వారి పితరులకు పిండ ప్రధానం
చేస్తారు.
పుస్కరాల్లో పిన్దప్రదానంతో పాటుగా
మొదటి రోజు;- సువర్ణ దానం,రజితము దానం,ధాన్య దానం ,భూదానం చేయాలి.
రెండవరోజు;-వస్త్ర దానం,లవణ దానం,రత్న దానం చేయాలి.
మూడవ రోజు;- గుడ(బెల్లం),అశ్వశాఖ,ఫల దానం చేయాలి.
నాల్గవ రోజు;-ఘృతం(నెయ్యి)దానం,తైలం(నూనె)దానం,క్షీరం(పాలు),మధువు(తేనె)దానం చేయాలి.
ఐదవ రోజు;-ధాన్యదానం ,శకట దానం,వృషభదానం,హలం దానం చేయాలి.
ఆరవవ రోజు;-ఔషధదానం,కర్పూరదానం,చందనదానం,కస్తూరి దానం చేయాలి.
ఏడవ రోజు;-గృహదానం,పీట దానం,శయ్య దానం చేయాలి.
ఎనిమిద రోజు;-చందనం,కందమూలాల దానం,పుష్ప మాల దానం చేయాలి.
తొమ్మిదవ రోజు;-పిండ దానం,దాసి దానం,కన్యాదానం,కంబళి దానం చేయాలి.
పదవ రోజు;-శాకం(కూరగాయలు)దానం,సాలగ్రామ దానం,పుస్తక దానం చేయాలి.
పదకొడవ రోజు;-గజ దానం చేయాలి.
పన్నెండవ రోజు;-తిల(నువ్వులు)దానం చేయాలి.

గోదావరి పుష్కరాలకు ఉంక ఇంకో ప్రాముఖ్యత అది, అంత్య పుష్కరాలకు అంతే పవిత్రత ఉండటం. మిగత అన్ని
నదులకు మొదటి పన్నెండు రోజులు మాత్రమే అత్యంత పవిత్రమైనవి అయితే గోదావరి పుష్కరాలకు మొదటి పన్నెండు
రోజులే కాకుండా చివరి పన్నెండు రోజులు కూడా అంటే పవిత్రమైనవి.

గురువు మేష రాశి లో సంచారించేప్పుడు గంగా నది కి, వృషభ రాశి లో సంచారించేప్పుడు రేవా నది
(నర్మద) కి, మిథున రాశిలో సంచారించేప్పుడు సరస్వతీ నదికి, కర్కాట రాశి లో సంచారించేప్పుడు యమునా నదికి
(ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు జూన్ 19న ప్రారంభమయ్యాయి),సింహ రాశిలో సంచారించేప్పుడు
గోదావరికి, కన్యా రాశిలో సంచరించేప్పుడు కృష్ణా నది కి, తులా రాశిలో సంచరించేప్పుడు కావేరీ నది కి,
వృశ్చిక రాశిలో సంచరించేప్పుడు భీమా నది కి, ధనుర్ రాశిలో సంచారించేప్పుడు పుష్కరవాహిని/రాధ్యసాగ నది కి,
మకర రాశిలో సంచరించేప్పుడు తుంగభద్ర నదికి, కుంభ రాశిలో సంచారించేప్పుడు సింధు నదికి, మీన రాశిలో
సంచారించేప్పుడు ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి.

గొల్లపెల్లి సంతోష్ కుమార్ శర్మ,
ఓం శ్రీ సాయి జ్యోతిష విద్యాపీఠం, ధర్మపురి
www.onlinejyotish.com

No comments:

Post a Comment

Thanks for your comment.