స్వస్తిశ్రీ వికారి నామ సంవత్సర పంచాంగము - ఫలితములు
పంచాంగ పీఠిక
Telugu Panchang details
Telugu Rashi phalaalu (Rashiphalalu)
కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియుగ ప్రథమ పాదములో 5120వది, ప్రభవాది 60 సంత్సరాలలో 33వది యైన ఈ సంవత్సరము చాంద్రమానమున స్వస్తిశ్రీ వికారి (వికారి ) నామ సంవత్సరంగా చెప్పబడుతున్నది.
- కలియుగ శతాబ్దములు – 5120
- శ్రీ ఆది శంకరాచార్యాబ్దములు – 2090
- శాలివాహన శతాబ్దములు – 1941
- ఫసలీ శతాబ్దములు – 1427– 28
- హిజరీ శతాబ్దములు – 1439 – 40
- శ్రీ రామానుజాబ్దములు – 1002
- క్రీస్తు శకము – 2019 -20
వికారి నామ సంవత్సర ఫలము
ఈ వికారి నామ సంవత్సరంలో రాజులకు యుద్దములు, అతివృష్టి, రోగ బాధలు ఎక్కువగా ఉంటాయి. లోకములు అధర్మముతో నిండి, ధన మూల యుద్ధములతో, స్వల్ప వృష్టి, స్వల్ప సస్యములతో కూడి యుండును.
రాజాధి నవనాయక నిర్ణయం
| రాజు | చైత్ర శుద్ధపాడ్యమి వారాధిపతి | శని |
| మంత్రి | మేష సంక్రమణ దినాధిపతి | రవి |
| సేనాధిపతి | సింహ సంక్రమణ దినాధిపతి | శని |
| సస్యాధిపతి | కర్క సంక్రమణ దినాధిపతి | బుధ |
| ధాన్యాధిపతి | ధనూ సంక్రమణ దినాధిపతి | చంద్ర |
| అర్ఘాధిపతి | మిథున సంక్రమణ దినాధిపతి | శని |
| మేఘాధిపతి | ఆర్ద్రాప్రవేశ దినాధిపతి | శని |
| రసాధిపతి | తులా సంక్రమణ దినాధిపతి | శుక్ర |
| నీరసాధిపతి | మకర సంక్రమణ దినాధిపతి | బుధ |
ఉపనాయకులు
|
| పురోహితుడు | వృషభ సంక్రమణ దినాధిపతి | బుధ |
| పరీక్షకుడు | కన్యా సంక్రమణ దినాధిపతి | కుజ |
| గణకుడు | కుంభ సంక్రమణ దినాధిపతి | గురు |
| గ్రామపాలకుడు | వృశ్చిక సంక్రమణ దినాధిపతి | శని |
| దైవజ్ఞుడు | మీన సంక్రమణ దినాధిపతి | శని |
| రాష్ట్రాధిపతి | ఉగాది వారాధిపతి | శని |
| సర్వదేశోద్యోగపతి | మేష సంక్రమణ దినాధిపతి | సూర్యుడు |
| గజాధిపతి | వృషభ సంక్రమణ దినాధిపతి | బుధ |
| పశునాం అధిపతి | మిథున సంక్రమణ దినాధిపతి | శని |
| దేవాధిపతి | కర్క సంక్రమణ దినాధిపతి | బుధ |
| నరాధిపతి | సింహ సంక్రమణ దినాధిపతి | శని |
| గ్రామనాయకుడు | కన్యా సంక్రమణ దినాధిపతి | కుజ |
| వస్త్రాధిపతి | తులా సంక్రమణ దినాధిపతి | శుక్ర |
| రత్నాధిపతి | వృశ్చిక సంక్రమణ దినాధిపతి | శని |
| వృక్షాధిపతి | ధనూ సంక్రమణ దినాధిపతి | చంద్ర |
| జంగమాధిపతి | మకర సంక్రమణ దినాధిపతి | బుధుడు |
| సర్పాధిపతి | కుంభ సంక్రమణ దినాధిపతి | గురు |
| మృగాధిపతి | మీన సంక్రమణ దినాధిపతి | శని |
| శుభాధిపతి | సంవత్సరాది తిథి అధిపతి | శని |
| స్త్రీణాం అధిపతి | ఆర్ద్రాప్రవేశ దినాధిపతి | శని |